Wednesday, May 27, 2026
Homeఆదిలాబాద్Job Scam | ఉద్యోగాల పేరుతో మోసం.. బాధితుల నిరసన

Job Scam | ఉద్యోగాల పేరుతో మోసం.. బాధితుల నిరసన

మెడికల్ కాలేజ్ లో ఉద్యోగం వస్తుందన్న ఆశతో డబ్బులు ఇచ్చి మోసపోయామని, న్యాయం చేయాలని బాధితులు రాథోడ్ వికాస్ శివకృష్ణ అన్నారు. ఫేక్ ఆర్డర్ కాపీలతో మోసపోయిన ఇద్దరు బాధితులు బుధవారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు.నిరుద్యోగంతో బాధపడుతున్న మాకు రాజేందర్ అనే ఏజెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మా కుటుంబానికి హామీ ఇచ్చారన్నారు. ఆఫీస్ సబర్డేంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయని రూ.2 లక్షలు ఖర్చు అవుతుందన్నారు.

దీంతో మెడికల్ కాలేజీలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో, ఏజెంట్ రాజేందర్ కు మోసపోయి రూ .2 లక్షల డబ్బులు ఇచ్చామని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటికి ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదన్నారు.గట్టిగా అడగడంతో.. మాకు అపాయింట్మెంట్ కాపీలు ఇచ్చారని తెలిపారు.

- Advertisement -

వాటిని తీసుకొని, మెడికల్ కాలేజీకి వెళ్లడంతో … వారు ఇక్కడ ఎటువంటి ఉద్యోగం లేదని అవి ఫేక్ ఆర్డర్ కాపీలని అక్కడి నుంచి పంపించేశారని తెలియజేశారు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపలేదు సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ జిల్లాలో అతనికి డబ్బులు ఇచ్చి చాలా మంది మోసపోయారాని ,వారు భయానికి బయటకు రావడం లేదని,వారికి అధికారులు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News