Wednesday, May 27, 2026
Homeరంగారెడ్డిInspection | కడ్తాల్ పీఎస్ ను ఆకస్మిక తనిఖీ

Inspection | కడ్తాల్ పీఎస్ ను ఆకస్మిక తనిఖీ

  • ఫ్యూచర్ సిటీ సిపి

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కడ్తాల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులు ఇతర సిబ్బందితో మాట్లాడారు. రికార్డు లను పరశీలించారు .

ఈ సందర్భంగా కమిషనర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజా ఫిర్యాదులను అత్యంత మర్యాదతో స్వీకరించాలని, బాధితుల సమస్యలను శ్రద్ధగా వినాలని, అలాగే చట్టప్రకారం త్వరితగతిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ప్రతి ఫిర్యాదును తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

- Advertisement -

అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా, సమయపాలనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. మరియు పోలీస్ స్టేషన్ యొక్క పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ పిలుపునిచ్చారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడడం, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించడం పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారితోపాటు మహేశ్వరం డిసిపి కె నారాయణరెడ్డి, మహేశ్వరం ఏసిపి ఎస్ జానకి రెడ్డి తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారనీ కడ్తాల్ ఇన్స్పెక్టర్ వి సైదిరెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News