- ఆరోగ్యానికి మేలుచేసే పదార్ధాలు ఎన్నెన్నో..
విదేశీ సూపర్‌ఫుడ్స్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండానే భారతీయ వంటగదిలోనే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వాడే కొన్ని సాధారణ మసాలా దినుసులు కూడా బెర్రీల వంటి సూపర్‌ఫుడ్స్‌కు సమానమైన యాంటీఆక్సిడెంట్ శక్తిని అందించగలవని తాజా సూచనలు వెల్లడిస్తున్నాయి. బెర్రీలు, నట్స్, ఆలివ్ ఆయిల్, ఆకుకూరలు వంటి సూపర్‌ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివని ఫిట్‌నెస్ నిపుణులు తరచూ సూచిస్తుంటారు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి.
- Advertisement -
