- ధర రూ. 1,59, 990 గా నిర్ణయం..
అమెరికాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన మోటరోలా, తమ సరికొత్త ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అయిన మోటరోలా రాజర్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ని మే 13న అనగా ఈరోజు భారత మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగింది. మోటోరోలా నుంచి వస్తున్న మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.
ఈ మోటరోలా రాజర్ ఫోల్డ్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ తో పాటు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం, 80డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల అవ్వడం జరిగింది. ఇక మోటరోలా రాజర్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో విడుదల అవ్వడం జరిగింది. వీటిలో బేస్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధరని రూ. 1,49,990 లుగా, అలాగే 16 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరని రూ. 1,59,990 లుగా కంపెనీ నిర్ణయించింది.
