- షణ్ముగం నేతృత్వంలో 25 మంది టీవీకే కు అనుకూలంగా ఓటు..
తమిళనాడు సీఎం విజయ్ బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ లో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే సీవీ షణ్ముగం నేతృత్వంలో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే కు అనుకూలంగా ఓటువేశారు. దాంతో విజయ్ 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్ష నెగ్గారు. విజయ్ మద్దతు కూడగట్టిన 119 మంది ఎమ్మెల్యేలతోపాటు అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కి ఓటేశారు.
అయితే.. ఎట్టి పరిస్థితుల్లో టీవీకేకు మద్దతు ఇవ్వకూడదని అన్నాడీఎంకేకు చెందిన 47 మంది ఎమ్మెల్యేలం ఒక తీర్మానం చేశామని ఆ పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి అంటున్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు తీర్మానం ప్రతిని కూడా సమర్పించారు. కానీ తాము ఏ తీర్మానంపై సంతకం చేయలేదని షణ్ముగం చెబుతున్నారు. పళనిస్వామి స్పీకర్‌కు సమర్పించిన నివేదికలోని సంతకాలన్నీ పోర్జరీ అని చెప్పారు. పార్టీ విప్‌ను నేరుగా పార్టీ జనరల్ సెక్రెటరీ నియమించరని సీవీ షణ్ముగం అన్నారు. మెజారిటీని బట్టి ఎవరు పార్టీ శాసనసభాపక్ష నేత, ఎవరు ఉపనేత, ఎవరు పార్టీ విప్ అనేది స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు.
