- అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకూడదని నిర్ణయం..
- ఉద్యోగులకు సూచనలు ఇచ్చిన యాజమాన్యం..
దేశీయ విమానయాన రంగ సంస్థ, టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా.. వ్యయ నియంత్రణ దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ‘సంస్థ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లవద్దు’ అని ఉద్యోగులకు యాజమాన్యం సూచించింది. అలాగే ఇప్పటికైతే ఉద్యోగాల తొలగింపులేమీ ఉండబోవని భరోసా ఇచ్చిన కంపెనీ.. కనీసం మూడు నెలలపాటైనా వార్షిక వేతనాల పెంపును వాయిదా వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్, సీఎఫ్‌వో సంజయ్ శర్మ, చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ జీపీ.. టౌన్‌హాల్‌లో ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. వీరంతా కూడా ఉద్యోగులకు దుబారాపై దృష్టి పెట్టండని నొక్కిచెప్పినట్టు తెలుస్తున్నది.
- Advertisement -
