Friday, May 8, 2026
Homeఆదిలాబాద్Fake Cotton Seeds | నకిలీ పత్తి విత్తనాల నిందితుల అరెస్టు

Fake Cotton Seeds | నకిలీ పత్తి విత్తనాల నిందితుల అరెస్టు

  • నిందితుల వివరాలను వెల్లడించిన బెల్లంపల్లి ఏసిపి
  • ఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో సూత్రధారి

బెల్లంపల్లి మండలం తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. అని బెల్లంపల్లి ఏసిపి ప్రవీణ్ కుమార్ తెలిపారు గురువారం తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ లో ఇద్దరు నిందితుల అరెస్ట్ చూపించారు ఈ సందర్భంగా ఏసిపి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పేర్కపల్లి కి చెందిన కొండపల్లి రాజేశం నెన్నెల కు చెందిన అట్కాపురం సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాలు రైతులకి అమ్ముతున్నారని, ఇంట్లో అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు కలిగి ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు, బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి S. ప్రేమ్ కుమార్ తీసుకొని, తాళ్ళగురిజాల SI పెరికపల్లి గ్రామంలోని కొండపల్లి రాజేశం ఇంటికి వెళ్లి, ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా ఒక సంచిలో ప్రభుత్వం అనుమతి లేని 29.5 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికినవి.

తరువాత నెన్నెల గ్రామంలోని అట్కాపురం సురేష్ ఇంటికి వెళ్లి అతని ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా ఇంటి వెనకాల పెరటిలో 25.5 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికినవి. ఇట్టి పత్తి విత్తనాలను వారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొటారు శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద నుండి తక్కువ ధరకు తీసుకొని బెల్లంపల్లి, నెన్నెల చుట్టుపక్కల రైతులకి మోసపురితంగా, మాయమాటలు చెప్పి ఎక్కువ దరకి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇట్టి పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు మొత్తం 55 కిలోలు, వాటి విలువ దాదాపు 1,32,000/- రూపాయలు ఉంటుంది.

- Advertisement -

నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని అదే విధంగా ఈ విత్తనాలు వాడటం వల్ల పర్యావరణం పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గ్లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడటం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

అందువల్ల రైతులు ప్రభుత్వం సరఫరా చేసే పత్తి విత్తనాలను వాడాలని అదేవిధంగా లైసెన్సు అనుమతి పొందిన ఫెర్టిలైజర్ దుకాణాల్లో మందులను తీసుకొని రసీదును తప్పకుండా తీసుకోవాలని అన్నారు. రైతులు దళారుల మాయమాటలు నమ్మి ఈ నకిలీ విత్తనాల బారి నుండి మోసపోకుండా ఉండాలని మా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా అవగాహన కార్యక్రమాలను కూడా పెట్టడం జరుగుతుందన్నారు.

గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లుగానే అమ్ముతున్నట్లుగాని సమాచారం తెలిస్తే తెలియజేయాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ Ch. హనోక్, S. ప్రేమ్ కుమార్ మండల అగ్రికల్చరల్ ఆఫీసర్,తాళ్ళగురిజాల ఎస్సై రామకృష్ణ తో పాటు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News