Tuesday, May 5, 2026
Homeస్పోర్ట్స్Victory | వరుసగా మూడో టైల్ సొంతం..

Victory | వరుసగా మూడో టైల్ సొంతం..

  • చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కిమీ ఆంటోనీ..
  • తొలి మూడు రేసులను గెలుచుకున్న తొలి డ్రైవర్..

ఫార్ములా వన్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌, 19 ఏళ్ల కిమి ఆంటోనెల్లి దూసుకెళ్తున్నాడు. మయామి గ్రాండ్‌ ప్రి టోర్నమెంట్‌ గెలిచిన ఆంటోనెల్లి తన కెరీర్‌లో వరుసగా మూడో టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. దాంతో ఫార్ములా వన్‌ చరిత్రలో తన తొలి మూడు రేసులను పోల్‌ పొజిషన్‌ నుంచి గెలుచుకున్న తొలి డ్రైవర్‌గా రికార్డు సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌ రేసును ఆంటోనెల్లి అందరికంటే వేగంగా (1:33:19.273సె) పూర్తి చేసి విజేతగా నిలిచాడు. మెక్‌లారెన్‌ రేసర్‌ నోరిస్‌ (+3.268సె) రెండో స్థానంలో, అదే జట్టుకు చెందిన ఆస్కార్‌ పియాస్ట్రి (+27.092సె) మూడో స్థానంలో నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News