- విక్టరీ స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు బొర్ర ప్రవీణ్ రెడ్డి.
- ఆలయ అర్చకుల సంక్షేమానికి 15వేల ఆర్థిక సహాయం.
- హర్ష వ్యక్తం చేసిన అర్చకులు,గ్రామస్థులు.
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవరచుకోవాలని, ఆ భక్తి మార్గంతోనే ముక్తి మార్గం లభిస్తుందని విక్టరీ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు బొర్ర ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు.నందిగామ మండల కేంద్రంలోని శ్రీ శివరామాంజనేయ స్వామి దేవాలయంలో నిత్యం పూజలు అందిస్తున్న ఆలయ అర్చకుల సంక్షేమం కోసం, మండల కేంద్రానికి చెందిన బొర్ర ప్రవీణ్ రెడ్డి, షాద్ నగర్ మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ వంకాయల నారాయణరెడ్డికి 15వేల రూపాయల నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవచింతన అలవరచుకోవాలని అన్నారు.అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. భక్తి మార్గంతోనే ముక్తి మార్గం లభిస్తుందని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి భాద్యత అన్నారు.ధర్మం రక్షణ కోసం,ఐక్యత కోసం ఒక్క హిందువు కృషి చేయాలన్నారు.దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
చిన్న వయసులోనే ఆలయ అర్చకులకు ఆర్థిక సహకారం అందజేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఏఎంసి మాజీ చైర్మన్, అర్చకులు, గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి,బలిజ లింగం,రాకేష్ రెడ్డి,పాండు తదితరులు పాల్గొన్నారు.
