Thursday, April 23, 2026
Homeఆంధ్రప్రదేశ్Vijayawada | ఏపీ కోర్టు కాంప్లెక్స్ లో ఆగిన లిఫ్ట్..

Vijayawada | ఏపీ కోర్టు కాంప్లెక్స్ లో ఆగిన లిఫ్ట్..

  • ప్రమాదం నుంచి తప్పించుకున్న న్యాయవాదులు..

ఏపీలోని విజయవాడకు చెందిన న్యాయవాదులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. దాదాపు గంటకు పైగా లిప్ట్‌ లో ఇరుక్కొని గాలి ఆరుగురు న్యాయవాదులు ఆడక ఇబ్బందులు పడ్డారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్‌లోని 7వ అంతస్తులో న్యాయవాదులు ఎక్కిన లిఫ్ట్‌ సాంకేతికలోపంతో మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో అందులో ఊపిరి ఆడక దాదాపు 40 నిమిషాల పాటు సతమతమయ్యారు. చివరకు టెక్నికల్‌ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది లిఫ్ట్‌లోకి ఆక్సిజన్‌ పంపి లిఫ్ట్‌కు మరమ్మతులు చేయడంతో న్యాయవాదులు సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. . చివరకు టెక్నికల్‌ సిబ్బంది మరమ్మతులు చేయడంతో న్యాయవాదులు సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.

- Advertisement -

కాగా భవనంలో తరుచు సాంకేతిక సమస్యలతో న్యాయవాదులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాదులు కోర్టు ఆవరణలో కొద్దిసేపు నిరసన తెలిపారు. సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News