బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ స్థలాలుగా మార్పు
- ఒకే రోడ్డుపై “నో పార్కింగ”.. “పార్కింగ” బోర్డులు
- ట్రాఫిక్‌కు అంతరాయం.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
- భద్రతా తనిఖీలు లేకుండా పార్కింగ్‌పై ఆందోళన
- ఉగ్రదాడుల ముప్పు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక
- నిర్వాహకులు, అధికారులు బాధ్యత వహించరా..?
- ఛలానాలు ప్రజలకేనా..? నిర్వాహకులకు కాదా..?
- ట్రాఫిక్ పోలీసులు, జీహెచఎంసీ సమాధానం చెప్పాలి..
- డిమాండ్ చేస్తున్న పలువురు సామాజిక వేత్తలు..
వినోదం కోసం నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లు, సాధారణ ప్రజల రాకపోకలు, భద్రతపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది.. మైదానంలో తమకు ఇష్టమైన ప్లేయర్ వికెట్ తీస్తేనో, సిక్స్ కొడితేనో ఈలలు, చప్పట్లతో అభిమానులు సందడి చేస్తారు.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ మ్యాచ్ కు వెళ్లేముందు.. తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తున్నారో ఒక్కసారి గమనించారా..? అదేవిధంగా మ్యాచ్ ముగిసిన తరువాత మీరు మీ మీ వాహనాలను తీసుకెళ్లడానికి ఎంత హైరానా పడుతున్నారో గమనించారా..? మీరు పార్క్ చేసిన వాహనాల వలన ఎన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి తెలుసా..? తెలిసికూడా మ్యాచ్ మత్తులో మా కెందుకులే అని మిన్నకుండిపోతున్నారా..? కనీసం బాధ్యతగా మెలగడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు..
ఇందులో మీ తప్పు లేకపోవచ్చు.. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పార్క్ చెయ్యమంటే అక్కడ పార్క్ చేసి వెళ్తున్నారు.. కానీ ఇక్కడ ఎందుకు పార్క్ చెయ్యాలి అని ఎప్పుడైనా ప్రశ్నించారా..? కోట్లు ఖర్చుబెట్టి ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్న సంస్థలు మ్యాచ్ చూడటానికి వచ్చే అభిమానుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయక పోవడం, నిబంధనలను అతిక్రమిస్తున్నారని తెలుసా..? “రూల్స్ ఆఫ్ ద రోడ్ రెగ్యూలేషన్స్, 1989 ప్రకారం బస్‌స్టాప్, స్కూల్, హాస్పిటల్ దగ్గర లేదా బోర్డులు, ప్రవేశద్వారాలు అడ్డుకునేలా పార్క్ చేయరాదు..కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.
అది మీరు గమనించారా..? అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారా..? సాధారణంగానో పార్కింగ్ ఉన్న రోడ్లు ఒక్కసారిగా “2 ` వీలర్ పార్కింగ్ ‘’గా మారిపోతున్నాయి. ఒకే రోడ్డుపై ఒక వైపు “నో పార్కింగ్ ‘’, మరో వైపు “పార్కింగ్ ‘’ బోర్డులు ఉండటం ఏమి సూచిస్తోంది? ఇది చట్టబద్ధమా? లేక ప్రజా రోడ్లపై ప్రయోగాలా? ఈ పరిస్థితిని ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ, జీ.హెచ్.ఎం.సి. అధికారులు గానీ ఎందుకు మార్చలేకపోతున్నారు..? ప్రేక్షకులకు ఒక ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు..? ఐపీఎల్ నిర్వహించే కంపెనీ అధినేతలు పెద్దవారు కాబట్టి.. వారి వెనుక రాజకీయ పలుకుబడి ఉంది.. అంగబలం, అర్ధబలం కూడా ఉన్నాయి.. అందుకే వారిని టచ్ చేయలేక పోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. నగరంలో ట్రాఫిక్ రూల్స్ తలకిందులవుతున్నాయి. సామాన్యుడు ‘నో పార్కింగ’లో బండి పెడితే బాదుడే బాదుడు అని ఛలానాలు వడ్డించే అధికారులు, ఐపీఎల్ నిర్వాహకుల విషయంలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లను సైతం పార్కింగ్ స్టాండ్‌లుగా మార్చడంపై భారతీయ వినియోగదారుల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. “రూల్స్ ఆఫ్ ద రోడ్ రెగ్యూలేషన్స్, 1989 ప్రకారం బస్‌స్టాప్, స్కూల్, హాస్పిటల్ దగ్గర లేదా బోర్డులు, ప్రవేశద్వారాలు అడ్డుకునేలా పార్క్ చేయరాదు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా నో పార్కింగ్ ఉన్న రోడ్లు ఒక్కసారిగా “2 ` వీలర్ పార్కింగ్ ‘’గా మారిపోతున్నాయి. ఒకే రోడ్డుపై ఒక వైపు “నో పార్కింగ్ ‘’, మరో వైపు “పార్కింగ్ ‘’ బోర్డులు ఉండటం ఏమి సూచిస్తోంది? ఇది చట్టబద్ధమా? లేక ప్రజా రోడ్లపై ప్రయోగాలా? హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టంగా చెప్పాలి.. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో చిత్రం రివర్స్‌లో ఉంది. ఇక్కడ తలెత్తున్న ప్రశ్నలు ఏమిటంటే.. ఏ ఆర్డర్ ద్వారా ఈ మార్పులు చేశారు?.. బస్ స్టాప్‌లను పార్కింగ్‌గా మార్చేందుకు అనుమతి ఉందా? ప్రజల భద్రతను ఎవరు చూసుకుంటారు?
ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసం. బస్ స్టాప్‌లు ప్రజా రవాణా కోసం. వీటిని పార్కింగ్‌గా మార్చడం ప్రజా హక్కుల ఉల్లంఘన కాదా? ఐపీఎల్ కోసం బస్‌స్టాప్‌లను పార్కింగ్ గా మార్చడం ప్రజల హక్కులను హరించడం అవుతుంది కదా..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వేల సంఖ్యలో అభిమానులు రావడం సహజమే. ట్రాఫిక్ నిర్వహణ అవసరమని ప్రతి పౌరుడూ అంగీకరిస్తాడు. కానీ అదే పేరుతో ప్రజా రవాణా బస్‌స్టాప్‌లను, ఫుట్‌పాత్‌లను రెండు చక్రాల పార్కింగ్ మైదానాలుగా మార్చటం ఎంతవరకు న్యాయం? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు..
సాధారణ రోజుల్లో “నో పార్కింగ” బోర్డులు ఉన్న ఈ రోడ్డుపై, మ్యాచ్ రోజు అకస్మాత్తుగా పెద్ద పెద్ద హోర్డింగులతో “ఐపీఎల్ 2 వీలర్ పార్కింగ్ బోర్డులు కనిపిస్తున్నాయి. బస్సు కోసం వేచిచూడాల్సిన ప్రయాణికులు రోడ్డుమధ్య నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది.. స్కూల్ పిల్లలు, వద్ధులు, మహిళలు ప్రమాదం మధ్య రోడ్డు దాటాల్సి వస్తోంది. “రూల్స్ ఆఫ్ ది రోడ్ రెగ్యులేషన్స్ “ ప్రకారం బస్‌స్టాప్ వద్ద, స్కూల్ దగ్గర పార్కింగ్ నిషిద్ధం అయినప్పటికీ, ఇలాంటి ఏర్పాట్లు ఎవరి అనుమతితో? ఏ షరతులతో? చేస్తున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది..


ట్రాఫిక్ పోలీస్, ఈవెంట్ నిర్వాహకులు, జీ.హెచ్.ఎం.సి. వీరందరూ కలిసి ట్రాఫిక్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెబుతారు. ఆ ప్లాన్‌లో బస్‌స్టాప్‌ల రక్షణకు, పాదచారుల హక్కులకు స్థానం లేదా? పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు గుర్తించడం బదులుగా, ప్రజల కోసం నిర్మించిన బస్‌షెల్టర్లను స్వాధీనం చేసుకోవడం ఏ విధమైన “స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట”? అవుతుందో వారే చెప్పాలి..
వినియోగదారుల సంఘాలు, పౌర సంఘాలు దీనిపై స్పష్టత కోరుతున్నాయి. ఐపీఎల్ వంటి వాణిజ్య కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నప్పుడు, ఆ ఫైల్లో “బస్‌స్టాప్‌ల ఆక్రమణకు అనుమతి ఉందా లేదా?” అన్న ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? నిబంధనలు ఉల్లంఘిస్తే, ఛలానాలు ప్రజలకు మాత్రమేనా? లేక నిర్వాహకులకు, పార్కింగ్ కాంట్రాక్టర్లకూ?
ఇప్పటికైనా ట్రాఫిక్ శాఖ, పోలీసు కమిషనరేట్, జీ.హెచ్.ఎం.సి. కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలి. రాబోయే మ్యాచ్‌లకు పార్కింగ్ ప్లాన్‌ను పారదర్శకంగా ప్రకటించి, బస్‌స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు పూర్తిగా స్వేచ్ఛగా ఉంచుతామని హామీ ఇవ్వాలి. ఐపీఎల్‌ను ఆస్వాదించే హక్కు ఎంత ముఖ్యమో, సురక్షిత ప్రజా రవాణా హక్కు కూడా అంతే ముఖ్యమని అధికారులు మరువకూడదని వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, వినియోగదారుల మండలి అధ్యక్షులు, సిసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, భారతీయ వినియోగదారుల సమాఖ్య తెలంగాణ రాష్ట్రకార్యదర్శి అందె శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వాన్ని, అధికారులను, ట్రాఫిక్ పోలీసులను సూటిగా ప్రశ్నిస్తున్నారు..
వినోదం ముఖ్యం కాదనలేం.. కానీ అది సామాన్యుడి ప్రాణాల మీదకు, హక్కుల మీదకు రాకూడదు. ఐపీఎల్ నిర్వహణ పేరుతో సాగుతున్న ఈ ‘పార్కింగ్ దందా’పై ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని వారు వారితోబాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
బైకుల్లో బాంబులు పెట్టుకొని వస్తే.. పార్కింగ్‌లో భద్రతా తనిఖీ ఉందా ? :
అందె శ్రీధర్ రెడ్డి అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేస్తూ, బైక్ లకు మరియు కార్లకు పార్కింగ్ చేయకపోవడం, ఫుట్ పాత్ లను, బస్టాండ్ లను ఆక్రమించి బైక్ పార్కింగ్ లా మార్చడం నిబంధనలు అతిక్రమించడమే అవుతుందని, అదే విధంగా వచ్చే బైక్ లను సరైన భద్రతా పరమైన చెకింగ్ లు చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల రోజు వారి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది కావున తక్షణమే ఇలాంటి ఐపీల్ మ్యాచ్ లకు సరైన పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, భారతీయ వినియోగదారుల సమాఖ్య తెలంగాణ రాష్ట్రకార్యదర్శి అందె శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వాన్ని, అధికారులను, ట్రాఫిక్ పోలీసులను, ఐపీల్ నిర్వాహకులకు సూటిగా ప్రశ్నిస్తున్నారు..
వినియోగదారుల తరపున కన్స్యూమర్ కమిషన్‌కి పిర్యాదు చేస్తాం? : సాంబరాజు చక్రపాణి “బస్‌స్టాప్‌ల ఆక్రమణకు అనుమతి ఉందా లేదా?” అన్న ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? నిబంధనలు ఉల్లంఘిస్తే, ఛలానాలు ప్రజలకు మాత్రమేనా? లేక నిర్వాహకులకు, పార్కింగ్ కాంట్రాక్టర్లకూ? ఇప్పటికైనా ట్రాఫిక్ శాఖ, పోలీసు కమిషనరేట్, జీ.హెచ్.ఎం.సి. కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలి.
రాబోయే మ్యాచ్‌లకు పార్కింగ్ ప్లాన్‌ను పారదర్శకంగా ప్రకటించి, బస్‌స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు పూర్తిగా స్వేచ్ఛగా ఉంచుతామని హామీ ఇవ్వాలి. ఐపీఎల్‌ను ఆస్వాదించే హక్కు ఎంత ముఖ్యమో, సురక్షిత ప్రజా రవాణా హక్కు కూడా అంతే ముఖ్యమని అధికారులు మరువకూడదని వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, వినియోగదారుల మండలి అధ్యక్షులు, సిసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి,ప్రశ్నిస్తున్నారు లేదంటే వినియోగదారుల తరపున కన్స్యూమర్ కమిషన్‌కి పిర్యాదు చేస్తామని తెలియజేసారు.
