Homeఆంధ్రప్రదేశ్AP | మాజీ సీఎం నాదెండ్ల కన్నుమూత..

AP | మాజీ సీఎం నాదెండ్ల కన్నుమూత..

  • సంతాపం తెలియజేసిన పలువురు ప్రముఖులు..

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనదని అన్నారు. భాస్కరరావు కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పితృవియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రావు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందారు.

1935 జూన్‌ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్‌ రావు 1978లో విజయవాడ ఈస్ట్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుంచి 1989 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1986 ఆగస్ట్‌ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. నాదెండ్ల భాస్కర్ రావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాదెండ్ల భాస్కర్‌ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News