- నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన కమ్మలకుంట తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నునావత్ నీలా –రమేష్ దంపతుల నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు లబ్ధిదారుల కుటుంబ సభ్యులను బట్టలు పెట్టి, శాలువాతో సన్మానించి, వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటిస్తూ వారి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, “పేదల కళ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ అసలైన లక్ష్యం. సొంతింటి కల ప్రతి పేద కుటుంబానికి చేరవేయడమే మా ప్రభుత్వ సంకల్పం” అని పేర్కొన్నారు…

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, గ్రామాల్లో ఇల్లు లేని పేద కుటుంబం మిగలకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు…

“పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ, గౌరవప్రదమైన జీవనానికి పునాది వేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం” అని ఎమ్మెల్యే నాగరాజు గారు స్పష్టం చేశారు… ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
