Wednesday, April 22, 2026
Homeరంగారెడ్డిMedchal | పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం..

Medchal | పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం..

  • కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం ఇదే..
  • వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుంది అని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు,మేడ్చల్ డివిజన్ పరిధిలోని 23వ వార్డుకు చెందిన యాడారం మంజుల అశోక్,7వ వార్డుకు చెందిన సాదరి దుర్గమ్మ,9వ వార్డు గిర్మాపూర్ గ్రామానికి చెందిన తలారి భాగ్యలక్ష్మీ సురేష్,గొంగుల వెంకటమ్మ లకు రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరైన నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో సోమవారం ముఖ్య అతిధులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవం చేశారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు.

పదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని,ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు,పట్టణాలు లేవని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేసారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మేడ్చల్ హౌసింగ్ కార్పొరేషన్ డిఇ అశోక్ రెడ్డి,ఏఇ సుభాష్ రెడ్డి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఉదండపురం సత్యనారాయణ,మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ,మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణా రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగరేణి పోచయ్య,బొక్క రఘుపతి రెడ్డి,రామన్నగారి సంతోష్ గౌడ్,బండి శ్రీనివాస్ గౌడ్,పంజగారి ఆంజనేయులు,నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News