- ప్రధాని మోడీ ప్రారంభించాల్సి ఉంది..
- రిఫైనరీకి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారుల వెల్లడి..
ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదుల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఈ రిఫైనరీకి భారీ నష్టం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పచ్‌పద్రలో సుమారు రూ.80,000 కోట్ల వ్యయంతో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించాల్సి ఉన్నది.
- Advertisement -
