Tuesday, June 23, 2026
Homeనల్లగొండBandh | మర్రిగూడలో ఏబీవీపీ పాఠశాలల బంద్ సంపూర్ణం

Bandh | మర్రిగూడలో ఏబీవీపీ పాఠశాలల బంద్ సంపూర్ణం

  • ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు

ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేత కుట్రలను విరమించుకోవాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది.

మండల కేంద్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మర్రిగూడ నగర కార్యదర్శి సందీప్ ధర్మ నేతృత్వంలో విద్యార్థి నాయకులు ఉదయాన్నే విద్యాసంస్థల వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా సందీప్ ధర్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 23,000 స్కూళ్లను మూసివేయాలనే ముఖ్యమంత్రి ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% సీట్లను కేటాయించాలని కోరారు.

ఖాళీగా ఉన్న MEO, DEO పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు రావలసిన యూనిఫాంలు, నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న బుక్స్, యూనిఫాం విక్రయాలను తక్షణమే నిషేధించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం అంటూ విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పానగంటి తేజ, ఆమంచ తేజ, రోహిత్, రాకేష్ తదితర విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News