Wednesday, April 22, 2026
Homeఅంతర్జాతీయంArrest | ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు సప్లై..

Arrest | ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు సప్లై..

  • మహిళా పారిశ్రామికవేత్త అరెస్ట్..

అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన ఇరాన్ సంతతి మహిళా వ్యాపారవేత్త, 44 ఏళ్ల షమీమ్ మాఫి అరెస్టు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ కు బాంబులు, డ్రోన్‌లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే ఆరోపణలపై యూఎస్ అధికారులు ఆమెను శనివారం రాత్రి లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఆరోపణలు రుజువైతే దాదాపు 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు ‘మొహాజెర్-6’ సాయుధ డ్రోన్‌లను సరఫరా చేసేందుకు ఆమె ఏకంగా 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. 2025లోనే ఈమె కంపెనీకి 7 మిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు జరిగినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. 2022 నుండి 2025 వరకు ఆమె ఇరాన్ నిఘా విభాగంతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ రికార్డులను పోలీసులు కోర్టు ముందు ఉంచారు. సూడాన్ రక్షణ శాఖకు 55 వేల బాంబు ఫ్యూజ్‌లను సరఫరా చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News