Sunday, April 19, 2026
Homeబిజినెస్Discount | కుషక్ మోడల్ కార్లపై రూ. 3 లక్షలు తగ్గింపు..

Discount | కుషక్ మోడల్ కార్లపై రూ. 3 లక్షలు తగ్గింపు..

  • అక్షయ తృతీయ సందర్భంగా ప్రకటించిన స్కోడా

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం స్కోడా..అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకంగా కుషక్‌ మాడల్‌పై రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. 1.0 లీటర్ల టీఎస్‌ఐ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌ను ఎనిమిది గేర్లు, నూతన టెక్నాలజీతో తీర్చిదిద్దింది. కంపెనీ వద్ద అమ్ముడుపోని వాహనాలను క్లియర్‌ చేయడంలో భాగంగా ఈ కుషక్‌పై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నది.

ఈ ఆఫర్‌ ప్రస్తుత నెల వరకు మాత్రమే వర్తించనున్నదని పేర్కొంది. ఈ డిస్కౌంట్‌ మొత్తంలో రూ.2 లక్షల వరకు నగదు రూపంలో లభించనుండగా, ఎక్సేంజ్‌ బోనస్‌ కింద మరో రూ.50 వేలు, కార్పొరేట్‌ లేదా లాయల్టీ ప్రయోజనాల కింద రూ.50 వేల వరకు ఇస్తున్నది. ప్రస్తుతం కుషక్‌ మాడల్‌ రూ.10.61 లక్షలు మొదలుకొని రూ.18.43 లక్షల లోపు లభించనున్నది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News