Friday, April 17, 2026
Homeరంగారెడ్డిTRVS | దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

TRVS | దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టిఆర్విఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం జవహర్ నగర్ పరిధిలోని సూర్య నగర్ కాలనీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మొనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిఆర్విఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ మున్న, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్ నయీమ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రధానంగా దివ్యాంగులకు 6000 రూపాయల ఆసరా పింఛన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

- Advertisement -

2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం అసమర్థత చూపుతుందని ఆరోపించారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో టిఆర్విఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుతారి రమేష్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News