- 150 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు*
- ఇద్దరు కొనుగోలుదారులు, ఒక ఆటో డ్రైవర్ అరెస్టు, పరారీలో సూత్రధారి*
- నిందితుల వివరాలను వెల్లడించిన మంచిర్యాల డిసిపి
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా (ఐపీఎస్) , మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్,తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య ఆదేశాలతో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుదవారము రోజున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు.
సోమవారం రోజున తాండూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బోయపల్లి బోర్డ్ NH-363 సమీపములో ఆటోలో బెల్లంపల్లి నుండి తాండూర్ కు నకిలీ పత్తి విత్తనాలను డంపు చేస్తున్నారని సమాచారం రావడంతో తాండూర్ ఎస్సై K. ప్రసాద్ మరియు కొండలే సుష్మ మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ తాండూర్ తన సిబ్బందితో కలిసి వెళ్లి బోయపల్లి బోర్డ్ వద్ద తనిఖీ చేయగా ఆటోలో నకిలీ పత్తి విత్తనాలు లభ్రమైనట్లు గుర్తించారు.
150 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు బోయపల్లి బోర్డ్ కు చెందిన వూస సుబ్బారావ్ s/o అక్కిశెట్టి, వయస్సు. 48 సంవత్సరాలు కులము బలిజ వృత్తి: SGT నారాయణ పూర్ (SC కాలని) గ్రామం నివాసము బోయపల్లి బోర్డ్ తాండూర్ మండలం మరియు కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగరి సమ్మయ్య s/o ఎల్లయ్య వయస్సు 35 సం. లు కులము కూర్మ వృత్తి వ్యవసాయము ఆటో డ్రైవరు అయిన మగ్దూం ఖాన్ s/o రసూల్ ఖాన్ వయస్సు 42 సం.లు కులము ముస్లిం వృత్తి ఆటో డ్రైవరు r/o తాండూర్ ఇద్దరు కొనుగోలుదారులు వీటిని కర్నూల్ నుండి గుంటుపల్లి శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేసుకొని వచ్చి ఉన్నట్లు డిసిపి వెల్లడించారు.
నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని అదే విధంగా ఈ విత్తనాలు వాడటం వల్ల పర్యావరణం పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గ్లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడటం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల రైతులు ప్రభుత్వం సరఫరా చేసే పత్తి విత్తనాలను వాడాలని అదేవిధంగా లైసెన్సు అనుమతి పొందిన ఫెర్టిలైజర్ దుకాణాల్లో మందులను తీసుకొని రసీదును తప్పకుండా తీసుకోవాలని అన్నారు.
రైతులు దళారుల మాయమాటలు నమ్మి ఈ నకిలీ విత్తనాల బారి నుండి మోసపోకుండా ఉండాలని మా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా అవగాహన కార్యక్రమాలను కూడా పెట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లుగానే అమ్ముతున్నట్లుగాని సమాచారం తెలిస్తే తెలియజేయాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని డిసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్,తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, కొండలే సుష్మ మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ ఎస్సై ప్రసాద్ తో పాటు సిబ్బంది ఉన్నారు.
