Thursday, April 16, 2026
Homeఆదిలాబాద్Electricity | కొత్త స్తంభాలు ఏర్పాటు చెయ్యాలి..

Electricity | కొత్త స్తంభాలు ఏర్పాటు చెయ్యాలి..

  • ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు..
  • అధికారులకు వినతి పత్రం సమర్పణ..

బెల్లంపల్లి పట్టణంలోని 6వ వార్డులో సింగరేణి విద్యుత్ స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని పాత కరెంటు స్తంభాలను తొలగించి, కొత్త స్థంబాలు వేయాలని అధికారులకు వినతిపత్రం సమర్పించిన 6వ వార్డ్ కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి అయితే, దీనిపై స్పందించిన సింగరేణి అధికారులు పిల్లి శ్రీనివాస్ కొత్త కరెంటు స్తంభాలు వేయకుండా, విద్యుత్ సరఫరాను నిలిపివేసారు

స్థానికులు దీనిపై ప్రశ్నించగా, “సింగరేణి కరెంటు స్తంభాలు లేవు అందుకే కరెంటు కట్ చేశాంఅంటు చెప్పి వెళ్లిపోయారు దీనిపై కౌన్సిలర్ కరెంట్ కట్ చేసిన సింగరేణి అధికారి పిల్లి శ్రీనివాస్ ను గత రెండు రోజులుగా కరెంట్ వేయండి అంటు మళ్ళీ వినతి పత్రం అందచేయడం జరిగింది రేపు మాపు అంటు చెప్తూ వస్తున్నాడు, కరెంట్ లేక నీళ్లు రాక ఉక్కపోతతో చిన్నా పెద్ద ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఈరోజు బస్తీ మహిళలతో కలిసి పిల్లి శ్రీనివాస్ ను అడగడానికి వెళ్తే ని దిక్కున్న కాడ చెప్పుకో అంటు లోపలికి రావద్దు అంటు డోర్లు మూసేసి వెళ్లి పోయారు, వార్డ్ మహిళా కౌన్సిలర్ అని చెప్పిన నీతో ఎం అయితే అది చేసుకో అంటు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానంచిన పిల్లి శ్రీనివాస్,

- Advertisement -

ఈ సందర్భంగా 6వ వార్డు కౌన్సిలర్ సల్ల కిష్ణవేణి మాట్లాడుతూ వార్డ్ కౌన్సిలర్ కె ఇ గతి ఉంటే మాములు ప్రజల పరిస్థితి ఏంటి ఇంత ఎండలో ఉక్కపోతలో వార్డ్ ప్రజల పరిస్థితి చూడలేక బాధ కానీ పిల్లి శ్రీనివాస్ అను సింగరేణి అధికారికి కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్లు మహిళలను అవమానం కరంగా మాట్లడం చాలా బాధకరం బెల్లంపల్లి పట్టణంలోని ఇతర సింగరేణి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణంగా కొనసాగుతుండగా, కేవలం 6వ వార్డులో మాత్రమే కరెంటు నిలిపివేయడంపై వార్డ్ కౌన్సిలర్ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.

ఈ ఘటనపై సింగరేణి అధికారులు స్పందించి కరెంట్ ఇవ్వాలని కోరారు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని లేకపోతే రోడ్డు పై ధర్నా చేస్తామని 6వ వార్డు కౌన్సిలర్ సల్ల కిష్ణవేణి బస్తీ ప్రజలు డిమాండ్ చేశారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News