Saturday, April 11, 2026
Homeహైదరాబాద్‌Kalyanam | వేడుకగా నామాలగుండు వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Kalyanam | వేడుకగా నామాలగుండు వెంకటేశ్వర స్వామి కళ్యాణం

  • ముఖ్య అతిథులుగా జోనల్ కమిషనర్,డీసీపీ హాజరు
  • భక్తులతో కిటకిటలాడిన దేవాలయ ప్రాంగణం

సికింద్రాబాద్ నామాల గుండు ప్రాంతంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో శనివారం నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.మంత్రోచ్చారణలు,మంగళవాయిద్యాల మధ్య దేవాలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.ఈ కార్యక్రమం ఆలయ ఫౌండర్ నోముల ప్రకాష్ రావు,చైర్మన్ నోముల ఇందిరా ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిథులుగా జోనల్ కమిషనర్ మంగతాయారు,అడిషనల్ డీసీపీ నరసయ్య హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ ఇందిరా ప్రకాష్ అతిథులను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

జోనల్ కమిషనర్ మంగతాయారు మాట్లాడుతూ,ఈ దేవాలయం భక్తుల కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు.డీసీపీ నరసయ్య దేవాలయం పురాతన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ భక్తులు స్వామివారి దీవెనలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.ఈ కళ్యాణ వేడుక కార్యక్రమంలో మహదేవన్ రవి, చికోటి శ్రీనివాస్,కిరణ్ బెజాడి,మున్నూరు చందు,బాలాజీ, భరత్ జైన్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News