Friday, April 10, 2026
Homeకెరీర్ న్యూస్JNTU | జె ఎన్ టి యు లో మేధోమధనం..

JNTU | జె ఎన్ టి యు లో మేధోమధనం..

  • వివరాలు వెల్లడించిన అధికారులు..

జేఎన్‌టీయూలో తొలిసారిగా పాలిటెక్నిక్‌ అనుబంధ, అనుసంధాన కాలేజీలకు చెందిన సిబ్బంది, విద్యార్థులకు మార్గదర్శకత్వంపై 10,11 తేదీల్లో సదస్సు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూలో నిర్వహిస్తున్న ఈ మేధోమధనం సదస్సుకు ఇంజినీరింగ్‌ కాలేజీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి, జేఎన్‌టీయూహెచ్‌ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ గురువారం తెలిపారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా, ఇతర ఉన్నతాధికారులతోపాటు ఆ యూనివర్సిటీ వీసీ టీకేకే రెడ్డి, రెక్టార్‌ విజయ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News