Thursday, April 9, 2026
Homeక్రైమ్ వార్తలుCyber Fraud | పళ్ళాను పల్టీ కొట్టించిన కేటుగాడు..

Cyber Fraud | పళ్ళాను పల్టీ కొట్టించిన కేటుగాడు..

  • వికసిత్ భారత్ పేరుతో లక్షరూపాయలు టోకరా..

‘వికసిత్ భారత్’ పేరుతో సైబర్ మోసగాళ్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మోసం చేశారు. ఎమ్మెల్యేకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్టుమెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ‘వికసిత్ భారత్’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని నమ్మబలికాడు.

జనగామ నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపించాలని, దరఖాస్తుకు ఈరోజే గడువు ముగుస్తుందని నమ్మించాడు. ఒక్కో దరఖాస్తుకు రూ.2,500 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని, నలభై మందికి రూ.1 లక్ష వెంటనే పంపిస్తే దరఖాస్తు చేస్తానని చెప్పాడు. నియోజకవర్గంలోని అర్హులకు రుణాలు వస్తే స్వయం ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో నిందితుడు చెప్పిన నెంబర్‌కు ఎమ్మెల్యే డబ్బులు పంపించారు.

- Advertisement -

లక్ష రూపాయలు పంపించిన తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చి, ఎమ్మెల్యే ఆరా తీయగా, అది నకిలీ కాల్ అని తెలిసింది. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News