Homeరంగారెడ్డిHarish Rao | మార్కెట్ ను అర్ధాంతరంగా మార్చడం అన్యాయం

Harish Rao | మార్కెట్ ను అర్ధాంతరంగా మార్చడం అన్యాయం

  • ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, రైతుల ఆందోళనలు మరియు స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్థలాన్ని సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.

Thanneeru Harish Rao Visits Koheda Fruit Market

ఈ సందర్భంగా రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూ, అన్ని వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మార్కెట్‌ను నిర్మించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించి , 350 కోట్ల నిధులు సమకూర్చిందని కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ పేరు వినిపించకుండా చేయాలనే దురుద్దేశంతో తరలించడం అన్యాయమని ఆయన అన్నారు.

- Advertisement -
Thanneeru Harish Rao Visits Koheda Fruit Market011

ఈ కార్యక్రమంలో శ్రీ హరీష్ రావు తో పాటు మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News