నకిలీ లే అవుట్ సృష్టించడం.. నయా స్కాం చేయడం.. ఇదే వీరి వృత్తి
గూడెం బ్రదర్స్ చెప్పిందే చట్టమా..? ప్రభుత్వాలు మారినా మారని దందా..!
- పఠాన్ చెరులో వందల కోట్ల భూ స్కాం ఆరోపణలు
- సర్వే నెంబర్ 62లో అక్రమాలపై బాధితుల ఆగ్రహం
- ప్రభుత్వ భూములపైనా కబ్జా… పేద ప్రజల ఆవేదన
- ధరణి లోపాలను ఆసరాగా చేసుకున్నారనే విమర్శలు
- ఈడీ కేసులో బినామీ లింకులు బయటపడుతున్నాయా..?
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదిగోండి ఆధారం..
- విచారణ చేపించండి.. కేసులు నమోదు చేయండి..
- అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న న్యాయవాది
ఎన్ని రాతలు రాసినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు.. పరిస్థితుల్లో కూడా మార్పు రావడం లేదు.. ఏమిటి వారి స్పెషాలిటీ..? గవర్నమెంట్స్‌తో సంబంధం లేకుండా అధికారంతో అంటకాగుతూ.. ఎప్పటికప్పుడు అవినీతికి ఆలవాలమైన అధికారులను మేనేజ్ చేస్తూ.. కబ్జాల పర్వాలు కొనసాగిస్తూ.. అవినీతి రహదారిని నిర్మించుకుని తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్న గూడెం బ్రదర్స్ ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తొలిచి వేస్తోంది. డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరి అక్రమాలపై దృష్టి సారించాలని స్థానికులు, వీరి భారిన పడ్డ పేద ప్రజలు,పలువురు సామాజిక వేత్తలు,న్యాయవాదులు సైతం కోరుతున్నారు.. ప్రజల ఆస్తులను, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు..

సంగారెడ్డి జిల్లా, పఠాన్ చెరు నియోజక వర్గంలో గూడెం బ్రదర్స్ గత బీఆరఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డు పెట్టుకొని వందల కోట్ల భూ స్కాం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. పఠాన్ చెరు మండలంలోని పోచారం, ఇంద్రేశం గ్రామ శివారులో నకిలీ లే అవుట్ సృష్టించి బోగస్ పత్రాలతో చేస్తున్న కబ్జాలు ఇందుకు నిదర్శనం అని మండి పడుతున్నారు బాధిత ప్రజలు.. బినామీల పేరుతో దందాలు చేస్తూ, అవినీతి సొమ్ముతో అధికారులను మేనేజ్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి..

సర్వే నెంబర్ 62 లో బినామీల పేరుతో చేస్తున్న కబ్జానే అందుకు నిదర్శనం అంటున్నారు బాధితులు.. నకిలీ లే అవుట్ సృష్టించి గతంలో ఓనర్లుగా ఉన్నవారితో పాత తేదీలో భూమి అమ్మినట్లు బోగస్ పత్రాలను సృష్టించి కబ్జాలకు పాల్పడు తున్నారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. స్థానికులు చేస్తున్న ఆరోపణలకు గూడెం బ్రదర్స్ బినామీగా గుర్తించిన ఈడి కేసులో ఆస్తుల అటాచ్ చేసిన వ్యక్తి ప్యాలస్ హోటల్‌లో పనిచేసిన వ్యక్తి పైనే ఈ భూములు సైతం ఉండటం..

వీరి బినామీ అని వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది.. సదరు వ్యక్తి పై కేసు నమోదు కావడం అందుకు ఆధారం అంటున్నారు బాధితులు.. పేద ప్రజల భూమితో పాటు ప్రభుత్వ భూమిలో సైతం ప్లాట్లు చేసి అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారని బాధితులు చెబుతున్నారు.. దీనితో ఇక్కట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వ భూములు పేదల భూములను కబ్జాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వీరిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు..

అంతే కాకుండా రెవెన్యూ రికవరి యాక్ట్ కింద వీరి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటున్నారు పలువురు సామాజిక వేత్తలు.. గతంలో అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వ కాలంలో ధరణిలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని అధికార బలంతో కబ్జాలకు పాల్పడుతూ, అవినీతి సొమ్ముతో ఈ వ్యవహారాలు చేశారని ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు..

“వీరు చెప్పిందే చట్టం, చేసిందే న్యాయం” అన్నట్టుగా పరిస్థితి ఉండేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.. చట్టాలను పక్కన పెట్టి ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపణలు తీవ్ర తరమవుతున్నాయి..10 ఏండ్ల కింద గూడెం బ్రదర్స్ ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు చూస్తే ఏ మేరకు అక్రమాలు చేశారన్నది పెరిగిన ఆస్తులే అందుకు నిదర్శనం..
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వీరి అక్రమాల పై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని, చట్ట ప్రకారం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన విషయం పై, బోగస్ లే అవుట్ చేసిన వ్యవహారం పై ప్రభుత్వ భూముల్లో చేస్తున్న కబ్జాలపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులతో పాటు చట్ట ప్రకారం చర్యలు చేపట్టా లని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు స్థానిక పేద ప్రజలు, బాధితులు..
మునూత్ ట్రస్ట్ ను అడ్డుపెట్టి సృష్టించిన కాగితాలు, చేసిన కబ్జాలు,డాక్యుమెంట్లు పోయాయని అక్రమంగా తీసుకున్న సర్టిఫికెట్,ఈ వ్యవహారం తెలిసిన చర్యలు చేపట్ట కుండా పరోక్ష సహకారం అందించిన హైడ్రా కమిషనర్ తీరుపై వాస్తవాలను ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది
‘ఆదాబ్ హైదరాబాద’ ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..
