Thursday, April 2, 2026
Homeహైదరాబాద్‌Hyderabad | ఏప్రిల్ 4,5 తేదీలలో మాతృ సంస్కార్ సమాగమ్

Hyderabad | ఏప్రిల్ 4,5 తేదీలలో మాతృ సంస్కార్ సమాగమ్

హైదరాబాద్ విశ్వమంగళ్య సభ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4,5 తేదీలలో “మాతృ సంస్కార్ సమాగమ్” అనే పేరుతో రాష్ట స్థాయి మహిళా సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంగళ వారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మాతృత్వంలోని సహజ సిద్ధమైన శక్తిని మేల్కొల్పడం, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేయడం ద్వారా విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయడం ఈ సమ్మేళన ప్రధాన ఉద్దేశ్యమని 2010లో స్థాపించబడిన విశ్వమంగళ్య సభ..

సంస్కార్ (విలువలు), సామర్థ్య (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన), మరియు సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా పనిచేస్తుందని ఉపాధ్యక్షురాలు పూజా నరేడి తెలిపారు. భవిష్యత్ తరాలకు జీవన విలువలను అందిస్తూ సంస్కృతిని కాపాడే కీలక బాధ్యత తల్లులపైనే ఉందని సంస్థ అధ్యక్షురాలు బి. శృతి పేర్కొన్నారు. మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా దేశ నిర్మాణ శక్తిగా గుర్తించేలా సమాజాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కోఆర్డినేటర్ వరుణి రెడ్డి వివరించారు.

- Advertisement -

కుటుంబ మరియు సామాజిక బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇదొక చక్కని వేదిక అని, రాష్ట్రంలోని మహిళలు, ముఖ్యంగా తల్లులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సహ కోఆర్డినేటర్ నందావతి బోస్లే పిలుపునిచ్చారు. ఎంట్రీ టికెట్ ధర 500 ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డా. ఆశా జోషి కార్యదర్శి, గీతా చవ్హాన్ ఖజాంచి, బాబీ జీ గిరిజన అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News