Tuesday, March 31, 2026
Homeస్పోర్ట్స్PSL | బాల్ ట్యాపరింగ్ వ్యవహారం..

PSL | బాల్ ట్యాపరింగ్ వ్యవహారం..

  • పాక్ ఆటగాడు ఫఖర్ పై నిషేధం..

స్వదేశంలో జరగుతున్న టీ20 లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్‌ కు పాల్పడిన పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్‌పై నిషేధం పడింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌ నియమావళిని ఉల్లంఘించిన అతడు రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బంతి ఆకృతిని మార్చేందుకు ప్రయత్నించిన ఫఖర్ ఆర్టికల్ 2.14ను అతిక్రమించాడు. దాంతో, అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది పాక్ బోర్డు. అసలేం జరిగిందంటే..

పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్‌ జట్టుకు ఫఖర్ జమాన్ ఆడుతున్నాడు. మార్చి 29న కరాచీ కింగ్స్‌తో మ్యాచ్ సమయంలో అతడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన అంపైర్లు లాహోర్ జట్టుకు 5 పరుగుల జరిమానా విధించడంతో పాటు కొత్త బంతిని తీసుకున్నారు. ఫఖర్ తీరును తప్పుబట్టిన అంపైర్లు షాహిద్ సైకత్, ఫైజల్ ఖాన్ అఫ్రీది.. టీవీ అంపైర్ అసిఫ్‌ యాకూబ్, ఫోర్త్ అంపైర్ తారీక్ రషీద్‌లు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News