Tuesday, March 31, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSainikpuri Bhavans | అక్రమార్కుల చేతిలో సైనిక్పురి భవన్స్..

Sainikpuri Bhavans | అక్రమార్కుల చేతిలో సైనిక్పురి భవన్స్..

  • మహోన్నత సామ్రాజ్యాన్ని కబళిస్తున్న ‘పిల్లి’ దండు.. !
  • వైస్ చైర్మన్ అనారోగ్యం ఆసరాగా ఫోర్జరీ పర్వం జరుగుతోందా..!
  • చైర్మన్ కుటుంబాన్ని పిచ్చోళ్లుగా మార్చారని ఆరోపణలు..
  • సైనిక్ పురి భవన్స్ ను తన సామ్రాజ్యంగా మార్చుకున్న వైనం..
  • ముంభై హెడ్ ఆఫీసు అధికారులను కూడా మేనేజ్ చేస్తున్నాడనే విమర్శలు..
  • ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న పీటీ పిల్లి రాము..
  • తనకంటూ ఒక గ్యాంగ్ ను సృష్టించుకుని అవినీతి పరంపర..
  • విజిలెన్స్, ఈడీ, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలు పీటీ పిల్లి రాము అక్రమాస్తులపై దర్యాప్తు చేయాలి..
  • విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఈ అక్రమాలపై పోరాటం చేయాలి..
  • అప్పుడే పీటీ పిల్లి రాము చీకటి వ్యవహారాలకు తెర పడుతుంది..

ఆ విద్యా సంస్థ ఒకప్పుడు క్రమశిక్షణకు, విలువలకే మారుపేరు. కానీ నేడు అక్కడ అక్రమం రాజ్యమేలుతోంది.. విలువైన వృక్షాల మీద మాత్రమే కాదు, ఆ సంస్థను మహోన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తుల ప్రాణాల మీద కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.. భారతీయ విద్యాభవన్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఎయిర్ కమాండర్ జె.ఎల్.ఎన్. శాస్త్రి అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని, ఒక చిన్న స్థాయి ఉద్యోగి ఆ విద్యా వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగి, కోట్లాది రూపాయల కుంభకోణాన్ని నిర్భయంగా, నిస్సిగ్గుగా సాగిస్తున్నాడు.. అతగాడు చెప్పిందే వేదం.. అతను కనుసైగ చేస్తే కదిలే కాలం సైతం ఆగిపోవాల్సిందే.. అతనికి నచ్చని వాళ్ళను నిర్దయగా ఎలాంటి కారణం లేకుండా డిస్మిస్ చేస్తాడు..

తనకు నచ్చిన వాళ్లకి సరైన అర్హత లేకున్నా ఉద్యోగాలు కల్పిస్తాడు.. వేలల్లో జీతాలు వచ్చేలా ఏర్పాటు చేస్తాడు.. ఇతగాడి దుర్మార్గానికి దాదాపు 35 మందికి పైగా భవన్స్ ఉద్యోగులు బలైపోయారు.. తన అవినీతిని ప్రశ్నించినందుకే వారందరినీ తొలగించి వేశాడని విమర్శలు వెల్లువెత్తాయి.. తనని అడిగే వాడు వుండకూడదు.. ఎదురుతిరికే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు.. అన్నదే అతని కాన్సెప్ట్.. అవినీతి సామ్రాట్ గా ఏకచత్రాధిపత్యంగా సైనిక్ పురి భవన్స్ ను ఏలుతున్న పీటీ పిల్లి రామును కట్టడి చేయగల వారు ఎవరూ లేరన్నది తొలగించబడిన ఉద్యోగుల వాదన.. మరి ఇతగాడి అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చగల క్షణాలు ఎప్పుడొస్తాయి..? కాలం సమాధానం చెప్పాల్సిందే..

- Advertisement -

సైనిక్ పురి భారతీయ విద్యాభవన్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఎయిర్ కమాండర్ జె.ఎల్.ఎన్. శాస్త్రి 2024 ఫిబ్రవరి 12న ఒక ప్రోగ్రాంలో కుప్పకూలి పోయాడు.. అదే విధంగా ఇతర అనారోగ్య కారణాలతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. మాట్లాడలేని, కదలలేని స్థితిలో ఆయన ఉంటే.. అరబిందో జూనియర్ కాలేజీ పీటీ పిల్లి రాము, సెంట్రల్ ఆఫీస్ ఉద్యోగిని పులకంటి స్వప్నలు కలిసి ఆయన సంతకాలను ఫోర్జరీ చేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తొలగించబడిన కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు..

ఆమేరకు పోలీసులకు, ముంబై హెడ్ ఆఫీసుకు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది.. దురదృష్టం ఏమిటంటే మాజీ సైనికుడిగా భారత దేశానికి అత్యున్నత సేవలు అందించిన జె.ఎల్.ఎన్. శాస్త్రి, అటుపిమ్మట ఒక మహోన్నతమైన విద్యా వ్యవస్థను నడిపిన ఆయన ఈరోజు జీవచ్ఛవంలా మంచానికే పరిమితమై, కళ్ళముందు జరుగుతున్న అక్రమాలను చూస్తూ కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారని తొలగించబడిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

ఈ కథలో అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే శాస్త్రి కుటుంబ పరిస్థితి. ఆయన కుమార్తె లక్ష్మీదేవి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివి, భవన్స్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన మేధావి. అలాంటి వ్యక్తిని పిల్లి రాము తన మాయమాటలతో, బ్లాక్ మెయిలింగ్‌తో మానసిక క్షోభకు గురిచేసి, నేడు మతిస్థిమితం లేని వ్యక్తిగా మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఆమె కొడుకును కూడా మతిలేని వాడిగా మార్చివేశారు పిల్లి రాము అతని గ్యాంగ్ అని ఆరోపణలు కూడా ఉన్నాయి..

ఇక శాస్త్రి సొంత ఇంటిని (1000 గజాలు) ప్రైవేట్ సెక్యూరిటీ పేరుతో పీటీ పిల్లి రాము తన అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది.. శాస్త్రికి వచ్చే కోటిన్నర పెన్షన్ నిధులను కూడా కాజే యడం జరిగిందని తెలుస్తోంది.. ఈ అక్రమ సామ్రాజ్యానికి అండగా నిలుస్తున్న వ్యక్తి డాక్టర్ కోటా రామారావు… ఈయనకు అర్హత లేకపోయినా శారదా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా తిష్టవేసి, పీటీ పిల్లి రామును వెనుక నుండి నడిపిస్తున్నది ఈయ నేనని సమాచారం. ముంబై హెడ్ ఆఫీస్ వారికి శాస్త్రి ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇస్తూ, ఎవరిని కూడా ఆయనను కలవనివ్వకుండా ‘మెడికల్ ఐసోలేషన’ పేరుతో బంధించారని తెలుస్తోంది..

సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అక్కడి నుండి వచ్చే అధికారులకు పీటీ పిల్లి రాము ‘రాజమర్యాదలు’ చేస్తున్నాడు. 5 స్టార్ హోటళ్లలో బస, విందు, మందు, భారీ ప్యాకే జీలతో వారి నోళ్లు మూయిస్తున్నాడు. అందుకే ఇక్కడ సుమారు 1000 చెట్లు నరికి అమ్మినా, స్క్రాప్ తరలించినా, శాస్త్రి కుటుంబం నాశన మవుతున్నా ముంబైలోని పైస్థాయి అధికారులలో చలనం లేదు.

వీరి అక్రమాల చిట్టా చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి.. వృక్ష విధ్వంసం చేశారు.. వేల సంఖ్యలో టేకు, వేప చెట్ల నరికివేత. కేర్ టేకర్
బి. కుమార్ సహాయంతో టెండర్లు లేకుండా టన్నుల కొద్దీ ఇనుము అమ్మకం జరిగిందని తెలుస్తుంది.. పర్మినెంట్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్‌లోకి నెట్టివేయడం, ప్రశ్నించిన వారిని తొలగించడం జరుగుతోంది.. ఈ పీటీ పిల్లి రాము గ్యాంగ్ లో జూనియర్ కాలేజీ అటెండర్ ఉగ్రపల్లి రామారావు, కేంద్ర కార్యాలయం కేర్ టేకర్ బి. కుమార్, అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి భోగేశ్వర రావు, మెడికల్ కాలేజీ సూపెరిండేంట్ శారదా హాస్పిటల్, డాక్టర్ అడ్వైజర్ కోటా రామారావు వంటి వారు ఈ దోపిడీలో సహకారం అందిస్తూ భాగస్వాములయ్యారని తొలగించబడిన ఉద్యోగులు ఆవేదన చెందుతూ ఆరోపిస్తున్నారు.

కాగా శాస్త్రి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన ఆ బాధ్యతలు నిర్వహించడానికి, సైనిక్ పురి భవన్స్‌కి రమణయ్య అనే ఒక వయసు మీరిన వ్యక్తిని, ఇతను ఇంతకు ముందు గ్రూప్ కో ఆర్డినేటర్ గా విధులు నిర్వహించేవాడు.. ఇతనిని హానరబుల్ సెక్రెటరీ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి సదరు రమణయ్యను ఆ పోస్ట్ లో నియమించుకుని, అతని సంతకాలతో లెక్కలేని అవినీతి కార్యకలాపాలు చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సదరు రమణయ్యకు సుమారు 89 సంవత్సరాల వయసు ఉంటుంది.. అతడికి వినికిడి లోపం ఉంది.. రెండు చెవులూ పనిచేయవు..

అలాగే అతని రెండు మోకాళ్ళ చిప్పలకు ఆపరేషన్ జరిగింది.. ఇంకా ఇతరత్రా అనారోగ్య సమస్యలు వున్నాయి.. తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకునే శక్తి లేదు..నడవగలిగే శక్తి కూడా లేదు.. ఇద్దరు పట్టుకుని లేపితే గానీ లేవలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి తన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడు..? కేవలం అతన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేయడానికి మాత్రమే రమణయ్యను నియమించుకున్నాడు పీటీ పిల్లి రాము.. కాగా ఇతగాడు రమణయ్య ఇంట్లో పనిచేస్తాడు.. కాలేజీలో తన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, పీటీ గా, వైస్ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించకుండా రమణయ్య ఇంటిలోనే తిష్టవేసి తన అవినీతి సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడని తెలుస్తోంది..దీనికి సంబంధించిన ఆధారాలను కూడా తొలగించబడిన ఉద్యోగులు బహిర్గతం చేస్తున్నారు..

అలాగే గతంలో స్కూల్, జూనియర్ కాలేజీ తదితరాలకు నలుగురు డైరెక్టర్స్ విధులు నిర్వహించేవారు..కానీ ఇప్పుడు కదలలేని పరిస్థితుల్లో రమణయ్య హానరబుల్ సెక్రెటరీతో బాటు ఈ నరుగురు డైరెక్టర్స్ విధులు కూడా వెలగబెడుతున్నారు.. అంటే 5 పదవులను ఏకకాలంలో నిర్వహిస్తుండటం గమనార్హం.. ఈ పీటీ పిల్లి రాము అనే దుర్మార్గుడు జూనియర్ కాలేజీ పీటీ గా, వైస్ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.. ఏఓ పులికంటి స్వప్న ప్రోద్భలంతో ముందుకు సాగుతున్నాడు..

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏఓ గా పులికంటి స్వప్న ఇంటర్వ్యూకి వచ్చినరోజే ఆమెను పర్మినెంట్ ఉద్యోగిగా విధుల్లోకి తీసుకుని రూ. 50000 జీతంగా ఏర్పాటు చేయడం జరిగింది.. ప్రస్తతం ఆమె జీతం దాదాపు రూ. 1,30,000 గా ఉందని తెలుస్తోంది.. మరి ఏ లెక్కన ఈమెకు అంత జీతం ఇస్తున్నారో తెలియాల్సి వుంది.. కాగా ఏఓ అన్న పోస్ట్ హానరరీ పోస్ట్.. ఈ పోస్ట్ పర్మినెంట్ అవడం అనేది జరుగదు.. మరి ఇదెలా సాధ్యం అయ్యిందో పీటీ పిల్లి రాముకే తెలియాలి.. కాగా అంతకుముందు ఏఓ గా హానరరీగా పనిచేసిన వాళ్లకు రూ. 25 వేలనుంచి, 30 వేలవరకు జీతం ఇచ్చేవాళ్ళు.. కానీ పీటీ పిల్లి రాము ఈ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి తన సొంత తెలివితేటలతో క్రియేట్ చేసిన పోస్ట్ అని ఆరోపణలు వస్తున్నాయి..

ఒక దేశ రక్షణలో పనిచేసిన ఎయిర్ కమాండర్ స్థాయి వ్యక్తికి, ఆయన కుటుంబానికి పట్టిన ఈ గతి చూస్తుంటే సభ్య సమాజం తలదించుకోవాలి. పీటీ పిల్లి రాము, ఏఓ పులికంటి స్వప్న, డాక్టర్ అడ్వైజర్ కోటా రామారావుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే, మహనీయులు నిర్మించిన సైనిక్ పురి భవన్స్ సామ్రాజ్యం నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఈ క్రింది చర్యలు తీసుకోవాలి..

  • జె.ఎల్.ఎన్. శాస్త్రి ఆరోగ్యంపై స్వతంత్ర మెడికల్ బోర్డుతో విచారణ జరిపించాలి.
  • గత ఏడాది కాలంగా జరిగిన సంతకాలపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలి.
  • పిల్లి రాము అక్రమ ఆస్తులపై ఎంక్వయిరీ చేపట్టాలి..ఇన్కమ్ టాక్స్ అధికారులు దృష్టి సారించాలి..
  • పిల్లి రాము అతని గ్యాంగ్ చేసిన, చేస్తున్న అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చాలి.

పీటీ పిల్లి రాము అతని అనుచరగణం చేస్తున్న అరాచకాలను మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది

“ఆదాబ్ హైదరాబాద్” “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

- Advertisement -
RELATED ARTICLES

Latest News