అవార్డులు అధికారుల కృషికి కొలమానాలని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవలే నిర్మల్ జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు లభించినందున, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావునుa హైదరాబాదులో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లాకు రెండు విభాగాల్లో స్కోచ్ అవార్డులు లభించడం ఎంతో గర్వకారణం అని మంత్రి ప్రశంసించారు. పొనికివనం, ఏర్పాటు అమ్మ రక్షిత కార్యక్రమం అమలు విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు అధికారులను మెచ్చుకున్నారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లాలో వినూత్న కార్యక్రమాలు అమలుపరిచేందుకు ప్రోత్సాహం అందిస్తూ, మార్గ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రికి, మంత్రి జూపల్లి, సీతక్క, దామోదర రాజనరసింహ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, తదితరులు ఉన్నారు.
