- ప్రొఫెసర్ నరేష్ రెడ్డి
మహిళల హక్కులకు చట్టబద్ధత తీసుకురావడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.నరేష్ రెడ్డి అన్నారు.ఓయూ ఆర్ట్స్ కాలేజీలో అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఫైట్ ఫర్ ఉమెన్ రైట్స్ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు మహిళలకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడంలో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
ప్రొఫెసర్ బి.లావణ్య మాట్లాడుతూ అంబేద్కర్ మహిళల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని,హిందూ కోడ్ బిల్ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి అని చెప్పారు.మహిళలకు విద్య,ఆర్థిక అవకాశాలు,సమాన హక్కులు కల్పించడంలో ఆయన కృషి విశేషమని పేర్కొన్నారు.సదస్సు డైరెక్టర్ ప్రొఫెసర్ లింగప్ప గోనాల్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను విద్యార్థులకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
