Thursday, March 26, 2026
Homeఆదిలాబాద్Negligence | మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

Negligence | మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

నిర్మల్ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కాలనీవాసులకు ఇబ్బందిగా మారింది. నిర్మల్ పట్టణం సోఫినగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు రాకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయింది. దీంతో కాలనీలోని అంజన్న స్వాములు ఆలయ పరిసర ప్రాంతాలలో స్వయంగా శుభ్రం చేసి తమ నిరసన తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు సంప్రదించిన పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News