Wednesday, March 25, 2026
Homeవరంగల్‌Narsampet | నర్సంపేటలో నయా వైద్యం….

Narsampet | నర్సంపేటలో నయా వైద్యం….

  • ప్రపంచం సిగ్గుపడేలా మైనర్ బాలికకు శీల పరీక్ష చేసిన వేద స్కానింగ్ సెంటర్….
  • తప్పుడు రిపోర్ట్ ఇచ్చి గర్భస్తురాలని స్పష్టం చేసిన స్కానింగ్ సెంటర్…..
  • ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన మైనర్ బాలిక…
  • హనుమకొండలో ఆపరేషన్…
  • గర్భం కాదని నిర్ధారించిన ఆసుపత్రి వర్గాలు…
  • నర్సంపేట స్కానింగ్ సెంటర్ డాక్టర్ను నిలదీసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు, బంధువులు…
  • ఐఎంఏ డాక్టర్ల జోక్యంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు…
  • ఘటనపై దుమ్మెత్తి పోస్తున్నా పట్టణవాసులు

ఓ మైనర్ బాలిక కడుపునొప్పి భరించలేక డాక్టర్ వద్దకు వెళ్తే స్కానింగ్ చేసుకోవాలని సూచించడంతో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డులో గల వేద స్కానింగ్ సెంటర్ కు వెళ్లిన మైనర్ బాలిక కు స్కానింగ్ తో పాటు గర్భస్థ నిర్ధారణ పరీక్షలు చేసి గర్భం ధరించిoదని తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలిక అభం శుభం తెలియక ఎలాంటి తప్పు చేయలేదు గర్భం ఎలా వస్తుంది అని ధైర్యంగా ముందుకు సాగి వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని బాలిక గర్భసంచిలో నీటి బుడగలు ఉండడంతో నొప్పి వస్తుంది అని గమనించిన వైద్యు లు ఆపరేషన్ చేసి నీటి బుడగలను తీసివేసి నర్సంపేట వైద్యులు చేసిన నయవంచన రిపోర్టుకు ఫుల్ స్టాప్ పెట్టారు.

అమ్మాయి పూర్తిస్థాయిలో కోరుకున్న తర్వాత నర్సంపేట పట్టణంలోని వేద స్కానింగ్ సెంటర్తో పాటు డాక్టర్ ములుగు సతీష్ ను తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులతో విచ్చేసి నిలదీయడంతో ఎండి డాక్టర్ అయిన ములుగు సతీష్ తప్పు జరిగినట్లుగా క్షమాపణ చెప్పాడు. వేద స్కానింగ్ సెంటర్ కు వెళ్ళగా దురుసుగా మాట్లాడడంతో వేద స్కానింగ్ నిర్వాహకులు సతీష్ సింధూర మైనర్ బాలిక తల్లిదండ్రుల బంధుమిత్రులను పై ప్రతి దాడి చేయడంతో టెన్షన్ నెలకొంది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ప్రమేయం తో చివరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది.

- Advertisement -

కడుపునొప్పి భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే గర్భస్థ నిర్ధారణ పరీక్షలు చేయడంలో మతలబు ఏంటి అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. పేషెంట్లు దొరుకుతే చాలు రక్తం పీల్చేయాలని కాచుకొని కూర్చున్న ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం ఇలాగే జరుగుతుందని నర్సంపేటలో మెడికల్ మాఫియా రోజురోజుకు పెట్రేగిపోయి రోగులపాలిటీ శాపంగా తయారవుతుందని వారి నియమ నిబంధనలు పక్కనపెట్టి ఇష్టాను రీతిలో అవసరం లేకున్నా స్కానింగ్లు చేయించి పేషంట్ల జేబులు పిండి వసూలు చేసుకుని ప్రజల రక్తం జలగల్లాగా తాగి ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు స్కానింగ్ సెంటర్లు మనుగడ సాగిస్తున్నాయని దానికి తోడు జనరిక్ మెడిసిన్ అమ్ముకుంటూ దానిపై ఉన్న ఎమ్మార్పీ రేట్లు అమాయక ప్రజలకు అమ్ముతూ కోట్లకు పడగల లెత్తుతున్నారని పలువురు పోతున్నారు.

వైద్యో నారాయణ హరి అన్న సామెతకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలంటే వేల? లక్షల అనే రీతిలో బిల్లులు వేస్తున్నారని అడ్డు అదుపు లేని అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్న. ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బడుగు జీవులు సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందని నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఎలాంటి తప్పు చేయని అభo శుభం తెలవని మైనర్ బాలిక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే చచ్చి శవమై తేలేదని బ్రతికుండగానే మనిషిపై తప్పుడు నిందలు వేసి నిలువెత్తున చంపేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు ఆస్పత్రుల సీజింగ్ లాంటివి చేపడితే తప్ప సమస్యలు రోజుకొకటి ఇలా నర్సంపేటలో ఉద్భవిస్తూనే ఉంటాయని పలువురు వాపోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News