- రెండు పేపర్లకు దరఖాస్తుచేసుకున్న 209 మంది..
- ఏప్రిల్ 4 తో ముగియనున్న గడువు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌కు దరఖాస్తులు ఊపందుకున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియడంతో దరఖాస్తులు జోరందుకున్నాయి. సోమవారం వరకు 2,20,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. విభాగాలవారీగా తీసుకొంటే ఇంజినీరింగ్‌కు 1,55,804మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 64,866, రెండు పేపర్లకు హాజరయ్యేందుకు 209 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల 13వరకు 1.3లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పదిరోజుల్లో 90వేలకుపైగా దరఖాస్తులు వచ్చా యి. ఏప్రిల్ 4తో గడువు ముగియనున్నది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసే అవకాశమున్నది. మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్ నిర్వహించనున్నారు.
