- 50 శాతం సీట్లను పెంచనున్న కేంద్రం..
- మహిళా రిజర్వేషన్ కొత్త కూడా పెంపు..!
త్వరలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, అలాగే పార్లమెంట్ స్థానాలను కేంద్రం పెంచబోతున్న సంగతి తెలిసిందే. అటు అసెంబ్లీలలో, ఇటు పార్లమెంట్లో 50 శాతం సీట్లను కేంద్రం పెంచబోతుంది. అలాగే, 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కోటాను కూడా అమలు చేయనున్నారు. ఇక ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 ఎంపీ సీట్లు 816 సీట్లుగా మారుతాయి. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి 119 స్థానాలుండగా, ఈ సంఖ్య 2029లో 179కి చేరుతుంది.తెలంగాణ పర్యాటకం అలాగే తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీ స్థానాలుండగా, వీటి సంఖ్య 26కు చేరనుంది.
ఎంపీ సీట్లకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఎన్ని స్థానాలు దక్కుతాయో చూద్దాం. యూపీలో ప్రస్తుతం ఉన్న 80 ఎంపీ సీట్లు 120కి, మహారాష్ట్రలో 48 నుంచి 72కు, పశ్చిమ బెంగాల్లో 42 నుంచి 63కు, బిహార్లో 40 నుంచి 60కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 44కు, రాజస్థాన్లో 25 నుంచి 38కి, గుజరాత్లో 26 నుంచి 39కి, ఒడిశాలో 21 నుంచి 32కి, ఝార్ఖండ్లో 14 నుంచి 21కి, అసోంలో 14 నుంచి 21కి, పంజాబ్లో 14 నుంచి 21కి, ఛత్తీస్గడ్లో 11 నుంచి 17కు, హరియాణాలో 10 నుంచి 15కు, ఢిల్లీలో 7 నుంచి 11కు, జమ్మూ-కాశ్మీర్లో 5 నుంచి 8కి, ఉత్తరాఖండ్లో 5 నుంచి 8కి సీట్లు, హిమాచల్ ప్రదేశ్లో 4 నుంచి 6కు, గోవాలో 2 నుంచి 3 సీట్లకు పెరగనుండగా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు అన్నింట్లో రెండేసి సీట్లుండగా, ఇప్పుడు 3 సీట్లు అవుతాయి. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 20 ఎంపీ సీట్లుండగా, ఇకపై 30 సీట్లు అవుతాయి.
ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 17 నుంచి 26కు, తమిళనాడులో 39 సీట్లుండగా 59కి, కర్ణాటకలో 28 సీట్లుండగా 42కు, ఏపీలో 25 సీట్ల నుంచి 38కి, కేరళలో 20 నుంచి 30కి పెరుగుతాయి. అలాగే నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. ఇప్పటివరకు లోక్సభలో 84 ఎస్సీ రిజర్వుడ్ సీట్లుండగా వీటి సంఖ్య 126కు పెరగనుంది. అలాగే, 47 ఎస్టీ సీట్లుండగా, 70 సీట్లకు పెరగనుంది. 2011 నాటి జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని సీట్ల సంఖ్యను కేంద్రం పెంచబోతుంది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును కేంద్ర త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశబెట్టబోతుంది
