Saturday, March 21, 2026
Homeఆంధ్రప్రదేశ్Tirumala | తిరుమలలో చంద్రాబు కుటుంబసభ్యులు..

Tirumala | తిరుమలలో చంద్రాబు కుటుంబసభ్యులు..

  • దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..
  • ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ప్రారంభం..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తన కుటుంబ సభ్యులతో కలిస తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్‌ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం రాక సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం రంగనాయక మండపంలో తీర్దప్రసాదాలు, ఆశీర్వవచనాలు అందజేశారు. మనవడు దేవాన్స్‌ బర్త్‌డే సందర్భంగా వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు.

- Advertisement -

న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సీఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు. తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు, ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోందని సీఎంకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News