Friday, March 20, 2026
HomeతెలంగాణHarish Rao | రేవంత్ రెడ్డి రైతుబంధు ఆపాడు..

Harish Rao | రేవంత్ రెడ్డి రైతుబంధు ఆపాడు..

  • సీఎం ముక్కునేలకు రాయాలి..
  • విమర్శలు చేసిన హరీష్ రావు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఆపిందని, అందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాయాలని, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలకు గత బడ్జెట్‌లో రూ.56 వేల కోట్లు కేటాయించారని, కానీ ఇప్పుడు దాన్ని రూ.50 వేల కోట్లకు తగ్గించారని చెప్పారు.

ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి, మహిళలకు నెలకు రూ.2,500.. వృద్ధులకు రూ.4,000 పెన్షన్‌ ఇస్తారేమోనని తాము భావించామని అన్నారు. కానీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు కేటాయింపులు తగ్గించి అమలు చేస్తున్న పథకాలకు కూడా కోతపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఇక జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా భట్టి విక్రమార్క చెప్పారని, కానీ బీఆర్‌ఎస్‌ హయాంలో తలసరి ఆదాయం అంతకంటే ఎక్కువగా ఉందని హరీష్‌రావు చెప్పారు.

- Advertisement -

రాష్ట్రంలో అవినీతి, అక్రమాల కారణంగా.. చేతగానీ పాలనవల్ల ఈసారి తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్యూర్‌ మోడల్‌ అంటూ తెలంగాణను, హైదరాబాద్‌ నగరాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తోందని.. ఇది ప్యూర్‌ మోడల్‌ కాదని, చోర్‌ మోడల్‌ గోల్‌మాల్‌ మోడల్‌ అని విమర్శించారు. బడ్జెట్‌లో మొత్తం అబద్దాలే ఉన్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణ అంశంలో ఇన్ని అబద్ధాలు చెప్పలేదని హరీష్‌రావు విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని అన్నారు. కనీసం జాబ్‌ క్యాలెండర్‌ గురించి ఏదైనా చెబుతారేమో అనుకుంటే అది కూడా లేదని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News