Homeఆదిలాబాద్Collector | ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి విద్య అందాలి

Collector | ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి విద్య అందాలి

  • పదవ తరగతి విద్యార్థులు పరీక్షలన్నీ ప్రశాంతంగా రాయాలి
  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ మంచి విద్యార్థి అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం, నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె పాఠశాల ఆవరణను పరిశీలించారు. ప్రతిరోజు మెరుగైన పారిశుధ్యం కొనసాగించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఆహ్లాదకరంగా పచ్చదనం పెంపొందించాలని సూచించారు.

- Advertisement -
ZP Secondary School Nirma

ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని అన్నారు.

అనంతరం పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్ని పరీక్షలు పూర్తయ్యాయి, ఎలా రాశారు అనే అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలపై ఎటువంటి భయం లేకుండా మిగిలిన పరీక్షలన్నీ ప్రశాంతంగా పూర్తి చేయాలని అన్నారు. సబ్జెక్టులలో ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని వివరించారు.

Collector Abhilasha Abhinav School Inspection Nirmal6

ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ పరీక్షలు పూర్తయ్యేంతవరకు తగిన సహకారం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడులు, పెన్నులు, తదితర పరీక్షల సామాగ్రి పంపిణీ చేశారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ ప్రభాకర్, ఎంఈవో వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ హరీష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Collector Abhilasha Abhinav School Inspection Nirmal01
- Advertisement -
RELATED ARTICLES

Latest News