నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసం సందర్శకుల రాకతో తుకారం గేట్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తుకారాం గేట్‌లోని ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాసానికి చేరుకుని ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యువకులు,మహిళలు,ఎమ్మెల్యేను కలుసుకుని పూల గుచ్ఛాలు అందజేస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి వారి అభినందనలు స్వీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీగణేష్, ఉగాది పర్వదినం కొత్త ఆరంభాలకు నాంది పలికే పండుగ అని పేర్కొన్నారు.ఈ నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి,సౌభాగ్యం,ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
ప్రజల ఆశీస్సులు,మద్దతుతో నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరింత కృషి చేస్తామని తెలిపారు.అలాగే తనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి కుటుంబం ఆనందంతో,ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు,ప్రముఖులు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
