Wednesday, March 18, 2026
Homeఆదిలాబాద్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌జ‌ల‌కు మంత్రి జూప‌ల్లి ఉగాది శుభాకాంక్ష‌లు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌జ‌ల‌కు మంత్రి జూప‌ల్లి ఉగాది శుభాకాంక్ష‌లు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌జ‌ల‌కు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ‘శ్రీ ప‌రాభ‌వ‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఉగాది మన వారసత్వపు పండుగ అని అభివర్ణించారు. పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు… జాతిని సజీవంగా నిలుపుతాయని తెలిపారు.

వ్య‌వ‌సాయ సంవ‌త్స‌రంగా ప‌రిగ‌ణించే ఈ ఉగాది రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు అన్ని రంగాల్లో శుభాల‌ను చేకూర్చాలి అని మంత్రి ఆకాంక్షించారు. సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అభిలాషించారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పండగ అన్నారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో.. ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.

- Advertisement -

రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తోంద‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ రంగ అభివృద్ధితో అనుబంధ రంగాలు, వృత్తులు బ‌ల‌ప‌డి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్ట‌మైందని తెలిపారు. జీవితం కష్టసుఖాల సమ్మేళనం, ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలన్నారు. శ్రీ ప‌రాభ‌వ‌ నామ సంవ‌త్స‌రంలో తెలంగాణ‌తో పాటు, దేశం మ‌రింత అభివృద్ధి సాధించాలి అని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News