మరో సంచికలో రాంబంధు అక్రమాలు..
- సైనిక్‌పురి విద్యావనంలో అక్రమాల వలయం
- పేరుకే ట్రస్ట్.. లోపల దోపిడీ రాజ్యం
- 50 ఏళ్ల గొప్ప చరిత్రకు ఐదేళ్లలో మచ్చ
- వయోభారంతో పక్కకు జరిగిన నాయకత్వం
- మేనేజ్‌మెంట్ లేకుండా ఇద్దరి చేతుల్లోనే వ్యవస్థ
- పాత ఉద్యోగుల తొలగింపు.. కొత్తవారితో ఆట
హైదరాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతంలో దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ విద్యా సంస్థ భారతీయ విద్యా భవన్ ఇప్పుడు వివాదాల ముసురులో చిక్కుకుంది. భారతీయ సంస్కృతి, నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ విద్యావనం గత ఐదారేళ్లుగా కొందరి ఆధీనంలో పడిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ఆధునిక విద్యను కలిపి సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మంచి పౌరులను తయారు చేయడం ప్రధాన లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రముఖ విద్యా ` సంస్కృతిక సంస్థ భారతీయ విద్యా భవన్. దీనిని కన్హయ్యలాల్ మాణిక్ లాల్ మున్షి (కేఎం మున్షీ) 1938, 7 నవంబరులో ముంబైలో భారతీయ సంస్కృతి విలువలను కాపాడుతూ విద్యను అందించే సంస్థగా భవన్స్ విద్యా సంస్థను స్థాపించారు.ఈ సంస్థ ప్రారంభానికి మహాత్మగాంధీ వంటి జాతీయ నాయకులు ఎంతో మంది ప్రోత్సాహం కూడా అందించారు.
భారతీయ సంస్కృతి , తత్వశాస్త్రం, ధర్మం, ఆధునిక విజ్ఞానాన్ని కలిపి విద్య అందించడమే మున్షీ ప్రధాన లక్ష్యం. ప్రపంచం నలుమూలల నుండి ఉన్నతమైన ఆలోచనలు మనకు రావాలి అనేది భవన్స్ యొక్క ప్రధాన మోటో. “భారతీయ సంస్కృతి విలువలతో కూడిన ఆధునిక విద్య ద్వారా సమాజానికి బాధ్యత గల మంచి పౌరులను తయారు చేయడం” భవన్స్ విద్యా సంస్థల లక్ష్యం. ఇది ఎలాంటి లాభాపేక్షలేని చారిటబుల్ పబ్లిక్ ట్రస్ట్.
భవన్స్ విద్యా సంస్థల ముఖ్య లక్ష్యాలు :
- భారతీయ సంస్కృతి పరిరక్షణలో భాగంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తత్వశాస్త్రం, విలువలను కాపాడుతూ వాటిని కొత్త తరాలకు అందించడం.
- ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం.
- నైతిక విలువల అభివద్ధిలో భాగంగా విద్యార్థుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను పెంపొందించడం.
- దేశభక్తి, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించడం.
- సంస్కృతి ? విజ్ఞానం సమన్వయం చేస్తూ భారతీయ ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని కలిపి బోధించడం.
భవన్స్ ముఖ్య సిద్ధాంతాలు..
- సత్యం, 2. ధర్మం, 3. శాంతి, 4. ప్రేమ,
- అహింస, 6. సహనం, 7. జాతీయ ఐక్యత,
- మానవతా భావం, 9. సేవా భావం,
- ప్రపంచ సోదరభావం.
ప్రపంచ వ్యాప్తంగా సంస్థలు :
ప్రారంభంలో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన భవన్స్ తర్వాత చాలా వేగంగా విస్తరించింది. పాఠశాలలు, కళాశాలలు, మేనేజ్‌మెంట్ సంస్థలు, సాంస్కతిక కేంద్రాలు, పరిశోధనా సంస్థలు. భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా భవన్స్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం భవన్స్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా విస్తతి ఉంది.ప్రపంచ వ్యాప్తంగా సుమారు 120 కంటే పైగా కేంద్రాలు, 350కి పైగా విద్యా సంస్థలున్నాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతార్, కువైట్, దక్షిణాఫ్రికా, తదితర దేశాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి.
సైనిక్‌పురిలో 50 ఎకరాలలో భవన్స్ :
ముంబాయి కేంద్రంగా ఏర్పడిన భారతీయ విద్యా భవన్ (భవన్స్) విద్యా సంస్థలు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో సైనిక్‌పురితో పాటు రాంకోటి, జూబ్లిహిల్స్, బెల్, నారాయణగూడ, తదితర ప్రాంతాలలో ఉన్నాయి. 1974లో సైనిక్‌పురిలో బ్రిగేడియర్ కేఎం రావు చొరవతో భవన్స్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని ఉచితంగానే ఇవ్వడం జరిగింది. భారతీయ విద్యా భవన్ ` శ్రీ రామకష్ణ విద్యాలయ స్కూల్, భవన్స్ వివేకానంద కాలేజీ, భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ, భవన్స్ శారదదేవి ఆస్పత్రి, భవన్స్ క్రికెట్ అకాడవిÖ, భవన్స్ టెన్నీస్ అకాడవిÖ ఇలా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తూ వచ్చారు.
గొప్ప చరిత్ర.. 5 ఏళ్లల్లో ఆగమాగం :
ఎంతో చరిత్ర కలిగిన సైనిక్‌పురిలోని భవన్స్ విద్యా సంస్థ మాఫియా చేతిలోకి పోయింది. గత ఐదారేళ్లుగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. ఈ సంస్థ భవన్స్ ఫౌండర్ మెంబర్ అయిన జేఎలఎన్ శాస్తినే వైస్ ఛైర్మన్ గా 1994 నుంచి చూస్తూ వస్తున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు.
ఇదే కొందరికి బాగా కలిసొచ్చింది. గౌరవ సెక్రటరీ, డైరెక్టర్లు లేరు. మేనేజ్‌మెంట్ కమిటీ లేదు. అంతా కూడా ఇద్దరు ఉద్యోగులే కథ నడిపిస్తున్నారు. అందిన కాడికి దోచేస్తున్నారు. పాత ఉద్యోగులను తొలగించారు. కొత్త వారిని నియమించుకొని ఇద్దరే దోచుకుతింటున్నారు.
మరో సంచికలో విద్యావనంలో “రాం” బంధు :
50 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ విద్యా సంస్థ భవన్స్. దీనిని గత ఐదారేళ్లుగా ఓ “రాం” బంధు దోపిడీ చేస్తున్నాడు. మరొకరితో కలిసి అందినకాడికి దోచుకుతింటున్నాడు. ఈ “రాం” బంధు లీలలు, అవినీతి, అక్రమాలు మరో సంచికలో.. మీ ముందుకు..
