మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సాధారణ బదిలీలలో భాగంగా ఎస్ రవి వనస్థలిపురం ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ గా ఆదివారం ఛార్జ్ (బాధ్యతలు) చేపట్టారు. ఉద్యోగ క్రమంలో భాగంగా మొదట హైదరాబాద్ కమీషనరేట్లో రవిబాబు ఎస్సై గా, రాచకొండ కమీషనరేట్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు. ఇంతకుముందున్న టి.మహేష్, ఇన్స్పెక్టర్ హైదరాబాద్ కు బదిలీపై వెళ్లారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవిబాబు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్, క్రమశిక్షణలో కచ్చితంగా వ్యవహరిస్తానని సాధారణ జనజీవనానికి ఇబ్బందులు లేకుండా, సమస్యలపై స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం అందిస్తామని తెలిపారు. వనస్థలిపురం అంటే మినీ ముంబై లాంటిదని ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారని, ఇలాంటి చోట విధులు నిర్వహించడం ఆనందదాయకమన్నారు.
- Advertisement -
