- అనారోగ్యం లేదా వడదెబ్బతో మృతి చెంది ఉండవచ్చు..
- చైతన్యపురి పోలీసులు!!
గురువారం ఉదయం సుమారు 08:00 గంటలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి, వయస్సు: 50-60 సంవత్సరాల వ్యక్తి మృత దేహం, భవాని టెంపుల్ దగ్గరలోని దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద పడిఉందని సమాచారం రావడంతో చైత్యపురి పోలీస్ వారు అట్టి గుర్తుతేలియని మృత దేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించి అట్టి వ్యక్తి వివరాల గురించి ఆరా తీయగా ఎలాంటి సమాచారం తెలియలేదు అని తెలిపారు. అతని ఫోటో, శారీరక వివరాల ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకునుటకు ప్రయత్నిస్తున్నామన్నారు.
అయితే 12.03.2026 నాడు ఉదయం సమయం లో అనారోగ్య కారణం వళ్ళ కానీ వడదెబ్బ వాళ్ళ కానీ చనిపోయి ఉంటదని తెలుస్తుంది, అతని పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. చామానచ్చాయా రంగు, ఎత్తు సుమారు 5 ½ అడుగులు. అతడి వంటి పైన రెడ్ &బ్లాక్ కలర్ చెక్స్ షర్ట్ మరియు బ్లాక్ కలర్ ప్యాంటు ధరించి బిక్షాటన చేసే వాడిలాగా కనపడుతున్నాడు అట్టి విషయమై
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ చైతన్యపురి పోలీసులు తెలియజేశారు.
ఇట్టి వ్యక్తి వివరాలు తెలిసినట్లైతే చైతన్యపురి పోలీసు వారికి తెలియచేవలసిందిగా మనవి.
చెత్తన్యపురి SHO సెల్ 8712662305
పోలీస్ స్టేషన్ సెల్ 8712662358
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సెల్ 9296005900.
