Thursday, March 12, 2026
Homeనల్లగొండప్రొహిబిట్ జాబితా నుంచి భూములు తొలగించాలని బి.ఆర్.ఎస్ ధర్నా.

ప్రొహిబిట్ జాబితా నుంచి భూములు తొలగించాలని బి.ఆర్.ఎస్ ధర్నా.

22-A Act 1908, POT Act 1977 ప్రకారం ఇళ్లు మరియు వ్యవసాయ భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. అట్టి భూములు మరియు ఇళ్లను ప్రొహిబిట్ జాబితా నుంచి తొలగించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10గంటలకు ఆలేరు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బాధితులకు న్యాయం చేయాలని, ప్రొహిబిట్ జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ఆలేరు పట్టణ కౌన్సిలర్లు,మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇళ్లు మరియు భూములు ప్రొహిబిట్ జాబితాలో ఉన్న బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News