- కోవిడ్ 19 తరువాత పెరిగిన ప్రమాదం..
సాధారణంగా గుండె జబ్బులు పురుషులకే ఎక్కువగా వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో మహిళల్లో కూడా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్ 19 తరువాత మహిళల్లో మరణాలకు ప్రధాన కారణం ఇస్కీమిక్ హార్డ్ డిసీజ్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని కరోనరీ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. కరోనరీ ఆర్టరీల్లో ప్లాక్ అనే కొవ్వు పదార్థం పేరుకుపోవడం వల్ల ఆర్టరీలు సన్నగా మారి గుండెకు సరిగ్గా రక్తాన్ని సరఫరా చేయలేవు.
ఈ ప్లాక్ లో ఒక భాగం విడిపోయి గడ్డగా ఏర్పడితే, అది ఆర్టరీని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. దీంతో గుండె కండరాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. మహిళలు ఎక్కువగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి మరింత తీవ్రమై మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
