Thursday, March 12, 2026
HomeజాతీయంJammu and Kashmir | భగవంతుడే నన్ను కాపాడాడు..

Jammu and Kashmir | భగవంతుడే నన్ను కాపాడాడు..

  • వెల్లడించిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్..

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయనపై ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చేందుకు ప్రయత్నించాడు. కానీ బుల్లెట్‌ గురితప్పడంతో ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటనపై తాజాగా ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు. ఆ భగవంతుడే తనను రక్షించాడని అన్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. వివాహ వేదిక నుంచి వస్తుండగా.. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వచ్చిందని, వెంటనే భద్రతా సిబ్బంది తనను కారులో ఎక్కించి అక్కడినుంచి పంపించేశారని చెప్పారు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంవల్లే తాను ఈ ఘటన నుంచి బయటపడగలిగానని అన్నారు. దాడి వెనక ఉద్దేశం ఏమిటనేది నాకు తెలియదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News