Wednesday, March 11, 2026
Homeఅంతర్జాతీయంTrump | త్వరలోనే యుద్ధం ముగుస్తుంది

Trump | త్వరలోనే యుద్ధం ముగుస్తుంది

  • చమురు ధరలు కిందకు దిగి వస్తాయి
  • ఇరాన్లోని బలగాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం.
  • అంతర్జాతీయ చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
  • అలా చేస్తే ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేస్తాం : సంచలన ప్రకటన చేసిన ట్రంప్

ఇరాన్పై యుద్దం కొనసాగుతుందని, వెనక్కి తగ్గేది లేదన్న ట్రంప్ కొంత మెత్త బడ్డారు. వెనక్కి తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇరాన్ కూడా గట్టి హెచ్చరికలు చేయడంతోనో ఏమో యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందని అన్నారు. ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకు దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామని, ఇరాన్పై దాడిని, మధ్యప్రాచ్యంలోని చెడును వదిలించడానికి అమెరికా చేసిన విహారయాత్రగా ట్రంప్ అభివర్ణించారు. ఆ విహారయాత్ర స్వల్పకాలికంగానే ఉంటుందని తెలిపారు.

మియామి గోల్ఫ్ క్లబ్లో రిపబ్లికన్ చట్ట సభ్యులతో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ‘ఇరాన్ యుద్ధం ఈ వారంలోనే ముగుస్తుందా’ అనే ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ‘లేదు. కానీ త్వరలోనే ముగుస్తుంది’ అని జవాబిచ్చారు. ‘మా సైనిక లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా పెద్ద అడుగులు వేస్తున్నాం. ఇరాన్లోని బలగాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం. అంతర్జాతీయ చమురు సరఫరాకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. అలా చేస్తే ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేస్తాం’ అని ట్రంప్ హెచ్చరించారు.

- Advertisement -

మెరికా, ఇజ్రాయెల్పై దాడిని పొడిగించేందుకు ఇరాన్కు తగినంత సామర్థ్యం లేదు కాబట్టి, యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన వారసుడిగా మొల్తాబా ఖమేనీ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా గా మొజాబాను ఎంపిక చేయడం పట్ల తాను చాలా నిరాశ చెందానని, అయితే కొత్త సుప్రీం లీడర్పై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని ట్రంప్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News