Homeరంగారెడ్డిCPI | ఆర్కే నగర్ లో ప్రభుత్వ పాఠశాల నిర్మించాలి

CPI | ఆర్కే నగర్ లో ప్రభుత్వ పాఠశాల నిర్మించాలి

  • సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్

వేల మంది నిరుపేదలు నివసిస్తున్న ఆర్కే నగర్ లో ప్రభుత్వ పాఠశాల లేకపోవటం దారుణం అని వెంటనే ఆర్కే నగర్ లో పదవ తరగతి వరకు అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాల నిర్మించి అక్కడి పాఠశాల విద్యార్థులు ఎదురుకుంటున్న ఇబ్బందులు తొలగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) అబ్దుల్లాపూర్ మెంట్ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిపిఐ ఆర్కే నగర్ శాఖ సమావేశం మంగళవారం నాడు ఆర్కే నగర్ శాఖ సహాయ కార్యదర్శి పేరాల గోపి అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్ ముఖ్య అతిధులుగా హాజరు అయ్యి సిపిఐ జెండాను ఆవిష్కరించిన అనంతరం అయన మాట్లాడుతూ.ఆర్కే నగర్ ఏర్పడి 20 యేండ్లు అయితున్నప్పటికి కూడా ఆర్కే నగర్ లో ఇప్పటికి ప్రభుత్వ పాఠశాల లేక చిన్న చిన్న పిల్లలు బస్సుల ద్వారా, ఆటో ల ద్వారా ఆన్నారం, నాగోల్ కి వెళ్ళటం అంత చిన్న వయసు పిల్లలకి ఇబ్బంది అని అన్నారు.

- Advertisement -
CPI Leader Ajmira Harisingh Nayak Demands Government School In RK Nagar

ఆర్కే నగర్ ప్రజలలాగే దేశంలో మెజారిటీ ప్రజలకి కనీస వసతులు అయిన కూడు,గూడు,ఉపాధి,విద్య,వైద్యం అందుబాటులో లేక దేశ వ్యాప్తంగా ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారని, సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు దోపిడీ,పిడన ఉన్నంత వరకు తిరుగుబాటు ఉంటుందని పోరాటాలు కూడా ఉంటాయని అన్నారు.

కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఉన్న చోట అభివృద్ధి జరుగుతుందని అందుకే రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పెద్ద అంబర్ పేట 52వ డివిజన్ లో సిపిఐ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆర్కే నగర్ తో పాటు ఇతర వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి ని సాదించుకోవటానికి సిపిఐ పార్టీ క

- Advertisement -
RELATED ARTICLES

Latest News