- తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టం.
- వారి అక్రమాలు వెలికితీస్తుంటే.. గిట్టకనే నాపై దుష్ప్రచారం.
- ఇంటెలిజెన్స్ విధులు కూడా అక్రమ వ్యాపారులే చేస్తున్నారా.?
- బీసీ నాయకులపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం.
- మీ భరతం పట్టే వరకు విశ్రమించేది లేదు.
- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్..
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య దుష్ప్రచారాలకు భయపడే వ్యక్తిని కాదని తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు తమపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిపై ఫిబ్రవరి 4 న తెలంగాణ డిజిపికి, కొత్తకోట పోలీస్ స్టేషన్లో, సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అందులో కొందరి పేర్లు మా దృష్టికి వచ్చినప్పటికీ వారిలో కొందరు ప్రముఖ రంగంలో ఉండడంవల్ల అక్కడితో వదిలేయడం జరిగిందన్నారు.
కానీ తిరిగి మంగళవారం తనను జిల్లా నుంచి బహిష్కరించినట్లు అదే వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన భూమా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని సోషల్ మీడియా గ్రూపులో యాడ్ చేసి తనను అప్రతిష్ట పాలు చేసే కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.తాను ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడితే, రైస్ మిల్లర్లు, పెట్రోల్ పంపులు, ఇండస్ట్రీస్, స్కూల్స్, కాలేజీలు వంటి దగ్గర ఒక్క రూపాయి వసూలు చేసినట్లు ఆధారం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. అవినీతి అక్రమాలు మీరు చేసుకుంటూ ఇతరులపై నిందారోపణలు మోపడం క్షమించరాని వీరమని హెచ్చరించారు.

భూమా రాజగోపాల్ రెడ్డి అనే ఒక సైకో వెదవకు జిల్లాలోని కొంతమంది రెడ్లు కలిసి బీసీల ఎదుగుదలను చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి అక్రమాలపై నిరంతర పోరాటం సాగిస్తున్నామని, అందులో భాగంగానే ఎక్సైజ్ సూపరింటెండెంట్, సివిల్ సప్లయ్ డిఎం, బీసీ వెల్ఫేర్ అధికారి వంటి కొంతమంది అవినీతి అధికారులపై బీసీ పొలిటికల్ జేఏసీ చేసిన పోరాట ఫలితంగానే సస్పెండ్ కావడం జరిగిందని గుర్తు చేశారు. మీరు చేసే అవినీతిపై ప్రశ్నించినందుకే తనను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారని, ఇకనుంచి ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
దమ్ము ధైర్యం లేకపోతే పెట్టిన పోస్టును ఎందుకు తొలగించారని, ఆడంగి వేషాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఎలాంటి కార్డు లేకున్నా మిల్లుల దగ్గర వసూలు చేసింది, ఇసుక మాఫియా దగ్గర వసూలు చేసిన విషయాలు, పెట్రోల్ పంపులు దగ్గర, పాఠశాలల్లో, కాలేజీల్లో మీరు చేసిన అక్రమ వసూళ్లను బయటపెట్టి మీ భరతం పట్టే రోజులు దగ్గరకు వచ్చాయని హెచ్చరించారు. తమ సొంత పనుల కోసం కొన్ని రోజులు ప్రజల మధ్య లేకపోయేసరికి ఇలాంటి గ్రామ సింహాలు వీధిన పడి మొరుగుతున్నాయని ఘాటు విమర్శలు చేశారు. బహిష్కరించినట్లు పోస్టులు పెడితే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
పోలీస్ విధులు, ఇంటలిజెన్స్ విధులు కూడా అక్రమార్కులే నిర్వహిస్తున్నారని, దీనిపై జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఐటి యాక్ట్ పనిచేయడం లేదా? అని నిలదీశారు. ప్యాడి టెండర్లో పాల్గొనడానికి మక్తల్ నుంచి వచ్చిన వ్యక్తి అవినీతి బాగోతాలపై తమ పనితీరు చూపిస్తామని, మీ వెనుక ఉండి వ్యవహారాలు నడిపిస్తున్న వ్యక్తిని బయటికి లాగే వరకు రాచాల వదిలిపెట్టడని గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వివి గౌడ్, దేవర శివ, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, యశ్వంత్ గౌడ్, మ్యాదరి రాజు, సొప్పరి రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
