Thursday, March 5, 2026
Homeఆరోగ్యంHearing | మ్యూజిక్ వింటున్నారా..?

Hearing | మ్యూజిక్ వింటున్నారా..?

  • ఇది మీకోసమే తప్పక చదవండి..

అధిక శాతం మంది ఎక్కువ శ‌బ్దంతో సంగీతాన్ని వింటూ ఉంటారు. అలాగే శుభ కార్యాల్లో ఎక్కువ శ‌బ్దంతో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా భారీ శ‌బ్దాల‌తో సంగీతం వినడం హానిక‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అధిక శ‌బ్దాల‌తో సంగీతం వినడం వ‌ల్ల చిన్న వ‌య‌స్సులోనే తిరిగి స‌రిచేయ‌లేని వినికిడి న‌ష్టం క‌లుగుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఎక్కువ శ‌బ్దంతో సంగీతం విన‌డం వ‌ల్ల వినికిడి శ‌క్తి తగ్గ‌డం నెమ్మ‌దిగా ప్రారంభ‌మ‌వుతుంది. దీనిని ప్రారంభ ద‌శ‌లో చాలా మంది గుర్తించ‌లేరు. అయితే ఈ న‌ష్టం తిరిగి స‌రిచేయ‌లేనిదని క‌నుక ముందు జాగ్ర‌త్త అవ‌స‌ర‌మ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. వినికిడి న‌ష్టం క‌ల‌గ‌కుండా ఉండాలంటే హెడ్ ఫోన్ వంటి వ్య‌క్తిగ‌త ఆడియో ప‌రిక‌రాల‌ను 60 శాతం కంటే త‌క్కువ వాల్యూమ్ తో ఉప‌యోగించాలి.

- Advertisement -

అలాగే ఒక గంట ఉప‌యోగించిన త‌రువాత విరామం తీసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఎంత ఎక్కువ శ‌బ్దంతో సంగీతాన్ని వింటే తీసుకునే విరామ స‌మ‌యం కూడా అంతే ఎక్కువ‌గా ఉండాల‌ని అప్పుడే వినికిడి న‌ష్టం త‌గ్గుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా యువ‌త అధిక శ‌బ్దంతో సంగీతాన్ని వింటూ ఉంటార‌ని దీని వ‌ల్ల వినికిడి న‌ష్టం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని వినికిడి న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పిల్ల‌ల్లో వినికిడికి సంబంధించిన ప‌రీక్ష‌లు చేయిస్తూ ఉండాల‌ని ముంద‌స్తుగా గుర్తించ‌డం వ‌ల్ల చికిత్స అందించ‌డం సుల‌భం అవుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News